/rtv/media/media_files/2025/09/22/deccan-cement-factory-2025-09-22-16-00-32.jpg)
Deccan Cement Factory
సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. తమ తోటి కార్మికుడి మృతికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఫ్యాక్టరీ గేటు వద్ద ఆందోళన చేస్తున్న బిహార్ కార్మికులు.. వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించిన పోలీసులపై దాడి చేశారు. ఈ దాడిలో పలువురు పోలీసులు గాయపడినట్లు సమాచారం. డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే ఓ కార్మికుడు పనిలో గాయపడ్డాడు. అతడిని చికిత్స కోసం మిర్యాలగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మరణించాడు. తమ తోటి కార్మికుడి మృతికి న్యాయం జరగలేదని ఆరోపిస్తూ.. బిహార్‌కు చెందిన వందలాది మంది కార్మికులు ఫ్యాక్టరీ గేటు వద్ద గుమిగూడి ఆందోళన చేపట్టారు. పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉండటంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
పోలీసులపై బిహార్ కార్మికుల దాడి ..
పోలీసులు కార్మికులను చెదరగొట్టే ప్రయత్నం చేయగా.. కార్మికులు మరింత ఆగ్రహానికి గురయ్యారు. కర్రలు, రాళ్లతో పోలీసులపై దాడికి దిగారు. ఈ ఊహించని దాడితో పోలీసులు పరుగులు తీశారు. కొందరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయం ఉన్నతాధికారులకు చేరడంతో.. అదనపు బలగాలను సంఘటనా స్థలానికి పంపించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఫ్యాక్టరీ యాజమాన్యం, కార్మికుల ప్రతినిధులతో పోలీసులు చర్చలు జరుపుతున్నారు.
ఇది కూడా చదవండి: ప్రాణం తీసిన పేకాట.. పోలీసులు రావడంతో పారిపోతుండగా హార్ట్ ఎటాక్!
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కార్మికులకు న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. ఈ ఘటనతో ఫ్యాక్టరీలో కొంతసేపు పని నిలిచిపోయినట్లు తెలుస్తోంది. న్యాయం కోసం నిరసన తెలపడం వాకి హక్కు అయినా పోలీసులపై దాడి చేయటం సరైన పద్ధతి కాదని పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యం తగిన సహాయం అందిస్తే.. ఈ పరిస్థితిని అదుపు చేయవచ్చని పోలీసులు అభిప్రాయం ఉన్నట్లు తెలుసుకుంది.
ఇది కూడా చదవండి: నాలుగో అంతస్తు నుంచి పడి ప్రాణాలతో బయటపడ్డ రెండేళ్ల బాలుడు.. కానీ ట్రాఫిక్ జామ్ తో చనిపోయాడు.. విషాద కథ!