/rtv/media/media_files/2025/02/28/QO2mtw6bCGv35cYSbnnq.jpg)
SLBC Tunnel Rescue
SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్‌లో ఫిబ్రవరి 22న ప్రమాదం జరగగా.. 19రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ జరుగుతూనే ఉంది. టన్నెల్‌లోని చివరి 40 మీటర్ల వరకు ప్రమాదకరంగా ఉండడంతో అక్కడ రోబోలను వినియోగించనున్నారు. బుధవారం అన్వి రోబోటిక్ సంస్థకు చెందిన అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబో టన్నెల్ వద్దకు తెప్పించారు. సంస్థ ప్రతినిధులు, సహాయక బృందాలతో కలిసి దాన్ని టన్నెల్‌లోని ప్రమాద స్థలానికి తరలించారు. దానితో బురదతో కూడిన నిక్షేపాలను తొలగించనున్నారు. సహాయక సిబ్బంది చేరలేని ప్రాంతాల్లో ఇవి 15 రెట్లు అత్యధిక సామర్థ్యంతో పనిచేస్తాయని అధికారులు చెబుతున్నారు. ఈ రోబో ద్వారా 40 హెచ్‌పీ పంపు సాయంతో బురదను బయటకు పంపనున్నారు.
Also read: Paris: బట్టలు లేకుండా రోడ్లెక్కి మహిళల నిరసన.. ఎందుకంటే?
అధికారుల పర్యవేక్షణలో అనుమానిత ప్రాంతాలైన డీ1, డీ2ల వద్ద తవ్వకాలు చేపడుతున్నారు. డీ2 పాయింట్‌లో కేరళ జాగిలాలు మరోసారి వాసన పసిగట్టడంతో మూడు రోజులుగా తవ్వకాలు జరిపారు. ఆ ప్రాంతాల్లో టీబీఎంకు సంబంధించిన లోహపు శకలాలు మాత్రమే కనిపించాయి. డీ1 నుంచి డీ2 మధ్య టీబీఎంకు సంబంధించిన మెటల్ ప్లాట్‌ఫాం ఉంది. దాన్ని కత్తిరించి అక్కడ పేరుకుపోయిన శిథిలాలు తొలగిస్తే గల్లంతైన కార్మికుల ఆచూకీ దొరికే అవకాశంఉందని అంచనాకు వచ్చారు. ఫ్లాట్‌ఫాం క్యాబిన్‌ను ప్లాస్మా, గ్యాస్ కటింగ్ పరికరాలతో కత్తిరించి శిథిలాలను తొలగిస్తున్నారు. టన్నల్‌లో ఓ మృతదేహం లభ్యమవగా.. మరో ఏడుగురి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
Also read: Holi Effect: మసీదులకు పరదాలు.. ఎక్కడో తెలుసా..?