Big Update In SLBC Rescue Operation | SLBC టన్నెల్ లో ఆపరేషన్ | Srisailam Tunnel Collapse | RTV
ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆఫరేషన్ 24 వ రోజు కొనసాగుతోంది. మనుషులు వెళ్లలేని ప్రాంతంలో రోబోలతో ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. డి1తో పాటుచివరి ప్రాంతంలో మట్టిని తవ్వేందుకు, రాళ్లు, శిథిలాలు ఎత్తిపోసి బయటికి తరలించేందుకు రోబోలను వినియోగిస్తున్నారు.
22 రోజులుగా ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకుని మృత్యువాత పడిన కార్మికుల కోసం నిర్వహిస్తున్న రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. రోజులు గడుస్తున్నా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నా ఇంకా సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికుల జాడ పూర్తిగా తెలియడం లేదు.
SLBC టన్నెల్లో చివరి 40 మీటర్ల వరకు ప్రమాదకరంగా ఉందని రెస్స్యూ ఆపరేషన్‌లో రోబోలను వినియోగించనున్నారు. మద్రాస్‌కు చెందిన అన్వి రోబోటిక్ హైడ్రాలిక్ పవర్డ్ రోబో టన్నెల్ వద్దకు తెప్పించారు. ఈ రోబో ద్వారా 40 హెచ్‌పీ పంపు సాయంతో బురదను బయటకు పంపనున్నారు.
SLBC టన్నెల్లో ప్రమాద స్థలానికి 20 మీటర్ల దూరంలో రెస్క్యూకు ఆటంకం కలుగుతుంది. దీంతో రోబోల సాయంతో పనులు ప్రారంభించారు. మద్రాస్ ఐఐటీకి చెందిన అన్వి రోబో టీం టన్నెల్ వద్దకు చేరుకుంది. మంగళవారం సాయంత్రంలోగా మరో ఇద్దరి మృతదేహాలు వెలికి తీయనున్నారు.