తాగి అసెంబ్లీకి వచ్చిన పాడి కౌశిక్ రెడ్డి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వీడియో!

పాడి కౌశిక్ రెడ్డి ఈరోజు శాసనసభకు తాగి వచ్చాడని కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం సంచలన ఆరోపణలు చేశారు. నరనరాన అహంకారం నింపుకున్న వ్యక్తి ఆయన అని ఫైర్ అయ్యారు. సభలో దళితుడైన స్పీకర్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అవమానించారన్నారు.

New Update
Telangana Assembly

పాడి కౌశిక్ రెడ్డి ఈరోజు శాసనసభకు తాగి వచ్చాడని కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం సంచలన ఆరోపణలు చేశారు. నరనరాన అహంకారం నింపుకున్న వ్యక్తి ఆయన అని ఫైర్ అయ్యారు. సభలో దళితుడైన స్పీకర్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అవమానించారన్నారు. కౌశిక్ రెడ్డి అణువణువునా అగ్రకుల అహంకారం నింపుకున్నాడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు వీరేశం. ఇదిలా ఉంటే.. ఈ రోజు ఫార్ములా-ఈ రేసు వ్యవహారంలో కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు అంశంపై చర్చ నిర్వహించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.

Also Read :  కేసీఆర్ సంచలన నిర్ణయం.. కేటీఆర్ అరెస్ట్ అయితే బీఆర్ఎస్ పగ్గాలు ఎవరికి?

Also Read :  హైదరాబాద్ లో 100 అడుగుల NTR విగ్రహం.. స్థలం కేటాయించిన సీఎం రేవంత్!

స్పీకర్ పోడియం వైపుకు దూసుకెళ్లిన బీఆర్ఎస్

ఇందుకు స్పీకర్ అంగీకరించకపోవడంతో వారు ఆందోళన చేపట్టారు. ఓ దశలో స్పీకర్ పోడియం వైపుగా బీఆర్ఎస్ సభ్యులు దూసుకెళ్లడంతో మార్షల్స్ అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పేపర్లు, వాటర్ బాటిళ్లను తమ వైపు విసిరేశారని కాంగ్రెస్ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్ హెడ్ ఫోన్స్ ను విసిరేశారని బీఆర్ఎస్ సభ్యులు ఆరోపిస్తున్నారు. 

Also Read :  తెలంగాణలో ఇక ఈ బ్యాంక్ కనిపించదు.. ఏపీలో మాత్రమే!

Also Read :  'ఇస్మార్ట్ జోడీ' లో కపుల్స్ సందడి.. ప్రోమోలో నిఖిల్, కావ్య..?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు