'ఇస్మార్ట్ జోడీ' లో కపుల్స్ సందడి.. ప్రోమోలో నిఖిల్, కావ్య..?

కపుల్ షో 'ఇస్మార్ట్ జోడీ' సీజన్ 3 త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. కపుల్ ఎంట్రీలతో ప్రోమో అంతా సందడిగా కనిపించింది. ఈ షో డిసెంబర్ 21 నుంచి ప్రారంభం కానుంది. ఈ ప్రోమోను మీరు కూడా చూసేయండి.

New Update

Ishmart Jodi:  ప్రేమ ఒక గమ్యమైతే ఆ ప్రయాణానికి పరీక్ష 'ఇస్మార్ట్ జోడీ' .. ప్రేమ ఒక తపస్సు అయితే. ఆ ఏకాగ్రతకి పరీక్ష 'ఇస్మార్ట్ జోడీ' అంటూ బిగ్గెస్ట్ కపుల్ రియాలిటీ షో 'ఇస్మార్ట్ జోడీ' సీజన్ 3 కి స్వాగతం పలికారు షో డైరెక్టర్ ఓంకార్. ఇప్పటికే రెండు సీజన్లు విజయవంతంగా పూర్తిచేసుకున్న ఈ షో.. ఇప్పుడు మరో సరికొత్తగా  సీజన్ 3 తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్  షో ప్రోమోను రిలీజ్ చేశారు. 

Also Read: ఆ లీక్డ్ ఫొటోతో ఎలాంటి సంబంధం లేదు.. నిధి ఇన్‏స్టా పోస్ట్ వైరల్!

ఇస్మార్ట్ జోడీ సీజన్ 3 ప్రోమో.. 

కపుల్ ఎంట్రీలతో ప్రోమో అంతా సందడిగా కనిపించింది. ఈ షోలో ప్రేక్షకులకు దగ్గరైన పలు సెలెబ్రెటీ జంటలు పాల్గొంటారు.  అలీ రెజా- మాసుమ, రాకేష్ - సుజాత, లాస్య- మంజునాథ్, ప్రదీప్- సరస్వతి, యష్- సోనియా, ఆదిరెడ్డి- కవిత, అమర్ దీప్- తేజు, అనిల్ జీలా - ఆమని జంటలు  ఈ సీజన్ లో పాల్గొంటున్నారు. గత సీజన్స్ తో పోలిస్తే సీజన్ 3 మరింత ట్రెండీగా..  తరాలతో పాటు మారుతున్న అభిరుచులను కూడా  ఆకర్షించేలా ఉండబోతున్నట్లు  మేకర్స్ తెలిపారు. ఇస్మార్ట్ జోడీ సీజన్ 3 డిసెంబర్ 21 నుంచి శనివారం, ఆదివారం రాత్రి 9 గంటలకు స్టార్ మా లో ప్రసారం కానుంది. 

నిఖిల్, కావ్య..?

అయితే ఈ షోలో ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ పాపులర్ బుల్లితెర పెయిర్ నిఖిల్, కావ్య కూడా వస్తారని ఫ్యాన్స్ అంతా ఆశపడ్డారు. కానీ వాళ్ళు షోలో లేకపోయావడంతో ఫ్యాన్స్ కాస్త  డిసప్పాయింట్ అయ్యారు. గత కొన్నేళ్లుగా రిలేషన్ లో ఉన్న ఈ బుల్లితెర జంట.. రీసెంట్ గా బ్రేకప్ చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. 

ఇది కూడా చూడండి:  తారక్, చరణ్ ఫ్యాన్స్ కు పండగ.. థియేటర్స్ లో RRR బిహైండ్‌ ది సీన్స్! ట్రైలర్ చూశారా

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు