/rtv/media/media_files/2025/03/11/rlnGkI323QJAXFLGnIuN.webp)
Telangana Assembly
KCR : మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై కాంగ్రెస్ నేతలు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. అసెంబ్లీకి రాకుండా జీతం తీసుకోవడం సరికాదని, ఆయనకు చెల్లించే వేతనం నిలిపివేయాలంటూ వారు ఫిర్యాదు చేశారు. ప్రతిపక్ష నేతగా ప్రజల పక్షాన నిలబడాల్సిన కేసీఆర్ జీతభత్యాలు పొందుతూ అసెంబ్లీకి రావడం లేదంటూ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, అసెంబ్లీ సెక్రటరీకి కాంగ్రెస్ పార్టీ నాయకులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అలాగే ఇన్ని రోజులు అసెంబ్లీ్కి రాకున్నా జీతం తీసుకున్నాడని, కేసీఆర్‌కు ఇచ్చిన జీతాన్ని కూడా రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. గత 14 నెలల నుంచి ఆయనకు ఇచ్చిన పదవిని సరిగ్గా నిర్వర్తించడం లేదని, ఇచ్చిన బాధ్యతను నెరవేర్చడంలో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని.. అందువల్ల ఇన్ని రోజులుగా ఆయనకు ఇచ్చిన జీతాలను రికవరీ చేయాలని హస్తం నేతలు లేఖలో కోరారు. ప్రజల సొమ్మును కేసీఆర్ జీతంగా వాడుకుంటున్న నేపథ్యంలో వేతనాన్ని నిలిపివేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కాగా ముఖ్యమంత్రిగా కేసీఆర్ రూ.4 లక్షల 21 వేల రూపాయలు వేతనంగా తీసుకున్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర శాసనసభ్యులకు నెలకు 2 లక్షల 50 వేల చొప్పున వేతనం ఇస్తారు.
Also read : డంకీరూట్ లో మరో ఇండియన్ మృతి..అక్కడే భార్య బిడ్డలు!
కాగా గతంలో అసెంబ్లీకి గైర్హాజరు నేపథ్యంలో కేసీఆర్‌కు ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ ఇన్ తెలంగాణ సోమవారం లీగల్ నోటీసులు పంపింది. ఈ మేరకు కేసీఆర్‌కు ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ ఇన్ తెలంగాణ తరపు న్యాయవాది పాదూరి శ్రీనివాస్ రెడ్డి మెయిల్, స్పీడ్ పోస్ట్ ద్వారా లీగల్ నోటీసులు పంపించారు. అసెంబ్లీకి హాజరుకాని కేసీఆర్‌పై అనర్హత వేటు వేయాలని అసోసియేషన్ జనరల్ సెక్రటరీ విజయ్‌పాల్ కోరారు. శాసన సభలో అపోజిషన్ లీడర్‌గా తన కర్తవ్యాన్ని నిర్వర్తించని మాజీ సీఎం కేసీఆర్‌కు సభలో సభ్యునిగా కొనసాగే అర్హత లేదని నోటీసులో వెల్లడించారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో కేసీఆర్ పోరాటం చేయాలని, లేదంటే అసెంబ్లీకి రాని కేసీఆర్‌ను వెంటనే అపోజిషన్ లీడర్‌గా తొలగించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌కు స్పీకర్ సమన్లు జారీ చేసి వివరణ కోరాలని విజయ్ పాల్ కోరారు.
Also read : CSK: జడేజా ఎంట్రీ వీడియో మామూలుగా లేదుగా...పుష్పరాజ్ రేంజ్ లో ..!
కాగా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ అపోజిషన్ లీడర్‌గా పదవి తీసుకున్నారు. కాలుజారి పడటంతో కేసీఆర్ కొంతకాలం విశ్రాంతి తీసుకుంటూ పూర్తిగా ఫాంహౌజ్‌కే పరిమితమయ్యారు. ఒకే ఒక్కసారి ఆయన సభకు హాజరయ్యారు. తర్వాత ఆయన అసెంబ్లీకి రాలేదు. అసెంబ్లీకి రావాలని కాంగ్రెస్, బీజేపీ నాయకులు పదే పదే కోరుతున్నా ఆయన స్పందించడం లేదు. అయితే ఇటీవల జరిగిన బీఆర్‌ఎస్ సమావేశంలో ఆయన బడ్జెట్‌సమావేశాలకు హాజరుకావాలని నిర్ణయం తీసుకున్నారన్న ప్రచారం వినపడుతోంది.
Also read : డంకీరూట్ లో మరో ఇండియన్ మృతి..అక్కడే భార్య బిడ్డలు!
Also read : CSK: జడేజా ఎంట్రీ వీడియో మామూలుగా లేదుగా...పుష్పరాజ్ రేంజ్ లో ..!