/rtv/media/media_files/2025/07/04/kavitha-feroz-khan-2025-07-04-15-06-20.jpg)
Feroz Khan: కాంగ్రెస్ నేత ఫిరోజ్‌ఖాన్ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. జూన్ 21న గాంధీభవన్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ భార్య, ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై ఆరోపణలున్నాయి. దీంతో ఆయన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న మహిళా కమిషన్ విచారణ చేపట్టింది.
Also Read: కెచప్‌తో రోటీ పరోటా పిల్లలకు ఇస్తే ఎంత ప్రమాదమో తెలుసా..?
ఫిరోజ్‌ఖాన్ వివరణ
ఈ క్రమంలో ఆయనకు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేయగా ఈ రోజు ఫిరోజ్‌ఖాన్ కమిషన్ ముందు హాజరయ్యారు. తాను చేసిన వ్యాఖ్యల పట్ల చైర్మన్ నేరెళ్ల శారదకు ఫిరోజ్‌ఖాన్ వివరణ ఇచ్చారు. అవి తాను ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్యలు కాదని, తనకు తెలుగు భాష సమస్య ఉందని తెలిపారు. ఇకపై మహిళల గురించి మాట్లాడేటప్పుడు..'గారు' అని సంబోధించాలని చైర్మన్ చెప్పారని ఫిరోజ్‌ఖాన్ వెల్లడించారు.
Also Read: రోటీని నెయ్యితో తినే విషయంపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారంటే!