Musi River: మూసీ పరివాహక ఆక్రమణలపై రేవంత్‌ సర్కార్ కీలక నిర్ణయం

మూసీ సుందరీకరణ, ప్రక్షాళన నేపథ్యంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలని రేవంత్‌ సర్కార్ నిర్ణయం తీసుకుంది. నిర్మాణాల తొలగింపు బాధ్యతను హైడ్రాకు అప్పగించిది. మూసీ పరివాహక ప్రాంతాంలో ఉంటున్న నిర్వాసితులకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కేటాయించనుంది.

New Update
Musi River

హైదరాబాద్‌లోని మూసీ పరివాహక ప్రాంతాల్లో ఆక్రమణలపై రేవంత్ సర్కార్‌ ఫోకస్‌ పెట్టింది. మూసీ సుందరీకరణ, ప్రక్షాళన నేపథ్యంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలని నిర్ణయం తీసుకుంది. మూసీని ఆక్రమించిన నిర్మాణాల తొలగింపు బాధ్యతను హైడ్రాకు అప్పగించిది. మరోవైపు మూసీ పరివాహక ప్రాంతాంలో ఉంటున్న నిర్వాసితులకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కేటాయించనుంది. ఇప్పటికే మూసీ ఆక్రమణలపై అధికారులు సర్వే నిర్వహించారు. మొత్తం 55 కిలోమీటర్ల పరిధిలో 12 వేలకు పైగా ఆక్రమణలు ఉన్నట్లు గుర్తించారు. 

Also Read: అది నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం.. కేటీఆర్‌కు పొంగులేటి సవాల్‌

ఇదిలాఉండగా శనివారం ఉదయం మలక్‌పేట నియోజకవర్గంలోని పిల్లి గుడెసెలలోని డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. మూసీ పరివాహక ప్రజలకు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. మూసీ సుందరీకరణపై సీఎం రేవంత్‌ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారని తెలిపారు. మూసీ ప్రాంతాన్ని పర్యాటక, పారిశ్రామిక, ఉపాధి అవకాశాలు పెంచే విధంగా అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు. మూసీ నది ప్రక్షాళన, పునః నిర్మాణాన్ని భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రచిస్తున్నామని వివరించారు. అలాగే డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణాలు ఇంకా ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయన్న విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

 

Advertisment
Advertisment
తాజా కథనాలు