Telangana: సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఇక నుంచి ఆ బాక్స్‌లు..! ఇక నుంచి టీజీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, వినతులు సమర్పించడానికి ఓ ఫిర్యాదుల పెట్టెను అందుబాటులో ఉంచనున్నట్లు సమాచారం. అందుకు తగిన చర్యలుతీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. By Bhavana 16 Nov 2024 in తెలంగాణ Latest News In Telugu New Update షేర్ చేయండి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఫిర్యాదులు, వినతులు సమర్పించడానికి ప్రత్యేకంగా ఫిర్యాదుల పెట్టెను తప్పనిసరిగా అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వీటిని రిజిస్ట్రార్ లేక ఆ పై ఉన్నతాధికారి పరిశీలించి విచారణ చేపట్టి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలంది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కొండాపూర్ లో రంగారెడ్డి జిల్లా జాయింట్ సబ్ రిజిస్ట్రార్ 1 ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయకపోవడాన్ని సవాలు చేస్తూ హైదరాబాద్ కేపీహెచ్‌బీకి చెందిన రమ్యశ్రీ తో పాటు మరోకరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. Also Read: Sabarimala: అయ్యప్ప దర్శనాలకు పోటెత్తిన భక్తులు..తొలిరోజే ఎంతమందంటే? దీని పై జస్టిస్ శ్రవణ్ కుమార్ ఇటీవల విచారణ చేపట్టారు. పిటిషనర్ తరుపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ అక్టోబర్ 11న ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసేందుకు సబ్ రిజిస్ట్రార్, కార్యాలయ సిబ్బంది ముడుపులు డిమాండ్ చేశారన్నారు. అధికారులు లక్ష్మణ్ రెడ్డి , సాయిలతో పాటు దస్తావేజు లేఖరి రూ. 2 లక్షలు డిమాండ్ చేశారన్నారు. Also Read: Kadapa: విద్యార్థులకు గుడ్ న్యూస్...నేడు పాఠశాలలకు సెలవు! Complaint Boxes హైకోర్టు ఆదేశాల మేరకు కోర్టుకు హాజరైన జాయింట్ సబ్ రిజిస్ట్రార్ వివరణ ఇస్తూ రిజిస్ట్రేషన్ కు పిటిషనర్ దరఖాస్తు సమర్పించలేదని తెలిపారు. అక్టోబర్ 11న తాను సెలవు పెట్టానంటూ జిల్లా రిజిస్ట్రార్ ధ్రువీకరించిన సర్టిఫికేట్‌ను సమర్పించారు. వాదనలను విన్న న్యాయమూర్తి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు పనులపై వచ్చేవారి కోసం రిజిస్టర్ ఒకటిఉంచాలని..జులైలో ఈ కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు..ఆగస్టులో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ , ఐజీ జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేయడంలేదని వ్యాఖ్యానించారు. Also Read: SCR: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. సికింద్రాబాద్ టూ... వీటి అమలుకు చర్యలు తీసుకోవాలని స్టాంపుల శాఖ ఐజీని ఆదేశించారు.రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ప్రజలు ఇబ్బందులు పడకుండా గతంలో జారీ చేసిన వాటితో పాటు తాజా మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకుని రిజిస్ట్రేషన్ ప్రక్రియను క్రమబద్దీకరించాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ ను న్యాయమూర్తి ఆదేశించారు. Also Read: BIG BREAKING: వైసీపీకి భారీ షాక్.. 11మంది రాజీనామా! ఇక నుంచి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఫిర్యాదులు వినతులు సమర్పించడానికి ఒక పెట్టే ఏర్పాటు చేయాలన్నారు. అందులో ప్రజలు వేసిన ఫిర్యాదులు, వినతులను సబ్ రిజిస్ట్రార్, ఆ పై ఉన్నతాధికారులు పరిశీలించి, అవసరమైతే విచారణ జరిపి పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. వీటి ఆధారంగా తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. #telangana #sub-registrar-office #complaint-boxes మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి