SCR: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. సికింద్రాబాద్ టూ...

సికింద్రాబాద్ నుంచి లక్నోకు స్పెషల్ ట్రైన్ సర్వీసును ప్రారంభించినట్టు రైల్వే శాఖ ప్రకటించింది.తెలంగాణతో పాటు ఏపీలోని ఏఏ స్టేషన్‌లలో ఆగనుందన్న వివరాలను రైల్వే శాఖ అధికారులు ప్రకటించారు. పూర్తి వివరాలు ఈ కథనంలో..

New Update
Railway : రైల్వే శాఖ కీలక నిర్ణయం... ఇక నుంచి అలా చేస్తే జరిమానా తప్పదు!

SCR: ట్రైన్‌ జర్నీచేసేవారికి సౌత్‌ సెంట్రల్ రైల్వే ఓ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ప్రయాణికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సికింద్రాబాద్ టూ లక్నో స్పెషల్ రైలు సర్వీసును ప్రారంభిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా నిన్న, మళ్లీ తిరిగి శుక్రవారం నవంబర్ 22న ఈ స్పెషల్ ట్రైన్ సర్వీసును నడపనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ స్పెషల్‌ ట్రైన్.. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ మీదుగా లక్నో చేరుకోనుంది. 

Also Read:Kadapa: విద్యార్థులకు గుడ్ న్యూస్‌...నేడు పాఠశాలలకు సెలవు!

అయితే.. తెలంగాణ, ఏపీలోని ఏ ఏ స్టేషన్‌లలో ఈ స్పెషల్ ట్రైన్ ఆగనుందన్నది దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. సికింద్రాబాద్ టూ లక్నో రూట్‌లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ స్పెషల్ ట్రైన్ ను మొదలుపెడుతున్నట్లు  సౌత్‌ సెంట్రల్‌ రైల్వే తెలిపింది. అయితే.. సికింద్రాబాద్ నుంచి లక్నో వరకు నడవనున్న ఈ స్పెషల్ రైలు (07084 ) శుక్రవారం  రాత్రి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో బయలుదేరింది. ఈ రైలు  ఆదివారం (నవంబర్ 17న) సాయంత్రం 6 గంటలకు లక్నో చేరుకోనుందని దక్షిణ మధ్య రైల్వే  తెలిపింది.

Also Read:  Sabarimala: అయ్యప్ప దర్శనాలకు పోటెత్తిన భక్తులు..తొలిరోజే ఎంతమందంటే?

అయితే.. ఇదే స్పెషల్ సర్వీసు నవంబర్ 18, 25 తేదీల్లో లక్నో నుంచి సికింద్రాబాద్‌కు బయలుదేరుతుందని అధికారులు చెప్పారు. సోమవారం నవంబర్ 18న ఉదయం 9 గంటల 50 నిమిషాలకు లక్నో స్టేషన్‌ నుంచి బయలుదేరి బుధవారం నవంబర్ 20  సాయంత్రం 3 గంటలకు సికింద్రాబాద్ చేరుకుటుందని రైల్వే శాఖ అధికారులు వివరించారు.

Also Read: UP: మెడికల్ కాలేజ్‌లో అగ్ని ప్రమాదం..10 మంది చిన్నారులు సజీవదహనం

ఇదిలా ఉంటే.. సికింద్రాబాద్ నుంచి లక్నోకు నడిచే ఈ స్పెషల్ ట్రైన్.. ఏపీ, తెలంగాణలోని ఏ ఏ స్టేషన్లలో ఆగుతుందన్న వివరాలు కూడా అధికారులు తెలిపారు. కాగా.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో బయలుదేరే ఈ ట్రైన్.. తెలంగాణలో నల్గొండ, మిర్యాలగూడ స్టేషన్‌లలో ఆగనుండగా.. ఏపీలోని గుంటూరు, విజయవాడ, దువ్వాడ, విజయనగరం స్టేషన్‌లలో స్టాప్ ఉందని  అధికారులు తెలిపారు. ఇక అక్కడి నుంచి.. భువనేశ్వర్, కటక్, గయా, వారణాసి, అయోధ్య స్టేషన్లలో ఆగుతూ.. లక్నో కు చేరుతుంది ఈ స్పెషల్ ట్రైన్. అయితే.. ఈ రైళ్లల్లో 3 ఏసీ కోచులు కూడా ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్రకటించింది.

Also Read: Dengue: వాతావరణంలో మార్పులతో డెంగ్యూ వస్తుందా?

అయితే.. ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే పలు మార్గాల్లో స్పెషల్ సర్వీసులు నడిపిస్తున్న విషయం తెలిసిందే. పండుగల వేళ ప్రయాణికుల రద్దీతో పాటు ప్రత్యేక సందర్భాలలో కూడా అవసరమైన మార్గాల్లో స్పెషల్ ట్రైన్ సర్వీసులను దక్షిణ మధ్య రైల్వే నడిపిస్తుంటుంది. ఈ క్రమంలోనే.. శబరిమలకు తెలంగాణతో పాటు ఏపీ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తెలుగు భక్తులు వెళ్లనున్న నేపథ్యంలో.. ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నడిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే.. సికింద్రాబాద్ నుంచి లక్నోకు వెళ్లే ప్రయాణికుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక సర్వీసులు నడిపిస్తోంది రైల్వే శాఖ.

Advertisment
Advertisment
తాజా కథనాలు