బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై అట్రాసిటీ కేసు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల బృందం అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. ప్రజలను రెచ్చగొట్టి శాంతి భద్రతలకు విఘాతం కల్పించేలా కుట్రకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ట్యాంక్‌బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం చుట్టూ సుందరీకరణ కోసం కట్టిన గోడను బీఆర్‌ఎస్ నాయకులు కూల్చేశారని తెలిపారు. ఇలాంటి దుశ్చర్య దళితుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తోందని.. అలాగే రాజ్యాంగ నిర్మాతకు జరిగిన ఈ అవమానం ప్రతీ భారతీయుడిని కలిచివేస్తుందని పేర్కొన్నారు.
Also Read: వరంగల్ లో దారుణం.. బాలికపై సీఐ అత్యాచారయత్నం
ఇలాంటి చర్యలను ఖండిస్తున్నామని.. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చట్టం ప్రకారం కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కేటీఆర్, కృశాంక్, తిరుపతి (కేటీఆర్‌కు పీఏ), అలాగే బీఆర్‌ఎస్ సోషల్ మీడియా వింగ్‌పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు. SC సెల్ అధ్యక్షులు నగరిగారి ప్రీతం నేతృత్వంలో తెలంగాణ ఖనిజ వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ ఇరవర్తి అనిల్, ముత్స్య కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి తదితరులు డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు.
Also Read: సియోల్‌లో తెలంగాణ మంత్రుల టీమ్ పర్యటన.. మూసీ ఎలా మారనుందంటే ?