Actress Hema: బెంగళూరు రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో నటి హేమకు బిగ్ రిలీఫ్ లభించింది. నటి హేమ.. తాను డ్రగ్స్ తీసుకున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని, తన పై నమోదైన కేసును కొట్టివేయాలని ఆమె తరపు న్యాయవాది హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. నేడు దీనిపై విచారణ జరగగా వాదోపవాదనలు విన్న న్యాయస్థానం కేసు తదుపరి చర్యల పై స్టే విధించింది. సుమారు నాలుగు వారల పాటు స్టే విధించింది. అనంతరం ఈ కేసు పై తదుపరి విచారణ చేపట్టనుంది.
Also Read: RGV: వివాదాలకు పోను, అమ్మాయిల జోలికి అస్సలే పోను.. RGV న్యూ ఇయర్ ట్వీట్ !
గతేడాది డ్రగ్స్ కేసులో అరెస్ట్..
గతేడాది బెంగళూరు శివారులో జరిగిన రేవ్ పార్టీలో పాల్గొన్న నటి హేమ పోలీసులకు పట్టుబడ్డారు. ఆ పార్టీకి 100 పైగా మంది హాజరు కాగా, వారిలో సినీ ప్రముఖులు, బుల్లితెర నటులు, కొంతమంది మోడల్స్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే 17 గ్రాముల ఎండీఎంఏ పిల్స్, కొకైన్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో అరెస్టైన హేమా బెయిల్ పై బయటకు వచ్చారు.
Also Read: Gandhi TathaChettu: థియేటర్స్ లో సుకుమార్ కూతురు అవార్డు విన్నింగ్ షార్ట్ ఫిల్మ్..!
Also Read: New Year 2025: న్యూ ఇయర్ రోజున ఈ పనుల్లో ఒకటైన చేయండి.. అన్ని శుభాలే