BIG BREAKING: స్థానిక ఎన్నికలపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు!

క్యాబినెట్‌ సమావేశంలో బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో ఈ విషయమై తదుపరి సమావేశంలో చర్చిద్దామని సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది.

New Update
Telangana Cabinet postponed to July 28

Telangana Cabinet

BIG BREAKING : బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలు సహా పలు అంశాలపై గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తారని అనుకున్నప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ రోజు రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ఈ విషయమై తదుపరి సమావేశంలో చర్చి్ద్దామని సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై హై కోర్టు స్టే విధించడంతో స్థానిక ఎన్నికలకు బ్రేక్‌ పడిన విషయం తెలిసిందే. దీంతో కాంగ్రెస్‌ పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలా? లేక హై కోర్టు తీర్పు కోసం వెయిట్‌ చేయాలా? అనే అంశంపై ప్రభుత్వం సమాలోచనలు చేస్తుంది.

అయితే గురువారం  ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశంలో స్థానిక ఎన్నికలపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరిగిన ఈ విషయం చర్చకు రాలేదు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లు రాష్ట్రపతి వద్ద, తర్వాత తెచ్చిన ఆర్డినెన్స్‌ గవర్నర్‌ వద్ద పెండింగ్‌లో ఉండడం, జీఓలపై ఉన్నత న్యాయస్థానం స్టే విధించిన నేపథ్యంలో మంత్రివర్గంలో ఏ  నిర్ణయం తీసుకోలేక పోయినట్లు తెలుస్తుంది. అయితే పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వపరంగా అన్ని రకాల ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకపోవడంతో పార్టీ పరంగా 42 శాతం సీట్లు కేటాయించేలా నిర్ణయం తీసుకుంటారన్న వాదన వినిపిస్తోంది.

కాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండాలన్న నిబంధనను ఎత్తివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్​ జారీ చేయనుంది. ఈ మేరకు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 లోని సెక్షన్ 21(3) ని సవరించేందుకు ఇటీవల కేబినెట్​ నిర్ణయించింది.  ఈ  ఫైల్ పై పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధిశాఖ మంత్రి సీతక్క,  సీఎం రేవంత్  ఇప్పటికే  సంతకం చేశారు. ఇవాళ కేబినెట్ ఆమోదించడంతో ఆ ఫైల్ ను  గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు పంపనున్నారు. గవర్నర్ సంతకం తర్వాత ఆర్డినెన్స్  జారీచేయనున్నారు. 

Also Read: Megastar MSVPG: క్రేజీ కాంబో.. 'మన శంకర వరప్రసాద్' వెంకీమామ ఎంట్రీ! గ్లిమ్ప్స్ అదిరింది

Advertisment
తాజా కథనాలు