కామారెడ్డిలో ఇటీవల భారీ వర్షాల కురవడంతో వరదలు పోటెత్తిన సంగతి తెలిసిందే. జనావాసాలు నీటిలో మునిగిపోయాయి. రోడ్లు ధ్వంసమయ్యాయి. పలు ప్రాంతాల్లో వంతెనలు కూలిపోయాయి. ఇప్పటికే వరదల్లో చనిపోయిన వారి బాధిత కుటుంబాలకు రేవంత్ సర్కార్ రూ.5 లక్షల పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా సీఎం రేవంత్ కామారెడ్డిలోని లింగంపేట మండలంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీశారు. కుర్దులో వరదల ప్రభావానికి ఆర్ అండ్ బీ వంతెన దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఆ బ్రిడ్జిని రేవంత్ పరిశీలించారు.
Also Read: ఖమ్మంలో దారుణం.. మామ వేధింపులకు కోడలి బలి.. పడక సుఖం ఇవ్వాలంటూ..!
వరదల సమయంలో వంతెన పరిస్థితిపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌కు కూడా ఆయన పరిశీలించారు. అనంతరం అధికారులతో మాట్లాడారు. బ్రిడ్జి నిర్మాణానికి పూర్తిస్థాయి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండాలంటే బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ లేదా బ్రిడ్జ్ కమ్ చెక్‌డ్యామ్ తరహాలో నిర్మించడం కోసం సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని చెప్పారు. అలాగే పూర్తిస్థాయి తరహాలో అంచనాలతో వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాన్నారు.