CM REVANTH: దేశవ్యాప్తంగా కులగణన అనేది కాంగ్రెస్ ఆధ్వర్యంలో సాధించే సామాజిక న్యాయం మూడో ఉద్యమమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మొదటి ప్రధానమంత్రి పండిట్ నెహ్రూ నుంచి ఇందిరా గాంధీ వరకు ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు, బ్యాంకుల జాతీయీకరణ వంటి కార్యక్రమాలతో సామాజిక న్యాయం మొదటి దశ సాధించిందన్నారు. రాజీవ్ గాంధీ హయాంలో 18 ఏళ్లకే ఓటు హక్కు.. మండల్ కమిషన్ నివేదిక వంటి కార్యక్రమాలతో సామాజిక న్యాయం @ 2.0 పూర్తయిందని చెప్పారు. ఇప్పుడు సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీల ఆధ్వర్యంలో కుల గణనకు సామాజిక న్యాయం @3.0 ప్రారంభమైందని అన్నారు.
రాహుల్ గాంధీ ప్రకటించిన మహా యుద్ధం..
ఈ మేరకు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీ తలకటొరా స్టేడియంలో నిర్వహించిన సంవిధాన్ రక్షక్ అభియాన్ సదస్సులో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. సామాజిక న్యాయం కోసం రాహుల్ గాంధీ మహా యుద్ధం ప్రకటించారని, ఆయన బాటలో నడుస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సామాజిక, ఆర్థిక, కుల సర్వే మొదలుపెట్టిందని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో సర్వే 92 శాతం పూర్తయిందని, తెలంగాణలో కుల సర్వే పూర్తి కాగానే తాము సామాజిక న్యాయం మూడో మహా యుద్ధాన్ని ముందుకు తీసుకెళతామని స్పష్టం చేశారు.
మోదీని ప్రజలు ఓడిస్తున్నారు..
పదేళ్లుగా దేశంలో రాజ్యాంగం ప్రమాదంలో ఉందని, రాజ్యాంగ రక్షణకు రాహుల్ గాంధీ దేశ వ్యాప్త ఉద్యమం చేపట్టారని రేవంత్ అన్నారు. రాహుల్ చేపపట్టిన ఉద్యమంలో ప్రజలు భాగస్వాములైనందునే మోదీ 400 వందల సీట్లు అడిగితే ప్రజలు కేవలం 240 సీట్లకు పరిమితం చేశారని చెప్పారు. దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల్లో మోదీని ప్రజలు ఓడిస్తున్నారని.. వయనాడ్, నాందేడ్ లోక్‌సభ ఉప ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శమని తెలిపారు. మహారాష్ట్రలో బీజేపీ కూటమి గెలిస్తే, ఝార్ఖండ్‌లో కాంగ్రెస్ కూటమి గెలిచిందన్నారు.
ఇది కూడా చదవండి: Rishab pant: ఢిల్లీని వీడటంపై పంత్ ఎమోషనల్.. మరీ ఇంత ప్రేమనా!
రాజ్యాంగ రక్షణ ఉద్యమం కేవలం రాహుల్ గాంధీకి పరిమితమైన అంశంగా అనుకోవద్దు. మనమంతా అందులో భాగస్వాములు కావాలి. ప్రస్తుత పోరాటం రాజ్యాంగ రక్షకులు.. రాజ్యాంగ శత్రువుల మధ్యనే ఉంది. మహాత్మా గాంధీ పరివార్ రాజ్యంగ రక్షణకు పూనుకుంటే.. మోదీజీ పరివార్ అంటే సంఘ్ పరివార్ రాజ్యాంగాని మార్చాలని చూస్తున్నారని సీఎం విమర్శించారు.
ఇది కూడా చదవండి: Rajastan: రాజుకే నో ఎంట్రీ..మహారాణా వారసుల మధ్య పట్టాభిషేకం చిచ్చు