Rajastan: రాజుకే నో ఎంట్రీ..మహారాణా వారసుల మధ్య పట్టాభిషేకం చిచ్చు మహారాణా ప్రతాప్ సింగ్ వంశంలో ఇప్పుడు దాయాదుల పోరు తారాస్థాయికి చేరింది. మేవార్ 77వ మహారాజుగా పట్టాభిషిక్తుడైన విశ్వరాజ్ సింగ్, ఆయన అనుచరులను ఉదయ్‌పుర్ కోటలోకి అడుగుపెట్టకుండా దాయాదులు అడ్డుకున్నారు. By Bhavana 26 Nov 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి Rajasthan: రాజస్థాన్‌లో మహారాణా ప్రతాప్ వారసుల మధ్య ఆధిపత్య పోరు తీవ్ర స్థాయికి చేరుకుంది. కొత్తరాజు పట్టాభిషేకం ఆ రాజవంశంలో చిచ్చురేపింది. మేవార్ 77వ మహారాజుగా పట్టాభిషిక్తుడైన విశ్వరాజ్ సింగ్, ఆయన అనుచరులను ఉదయ్‌పుర్ కోటలోకి అడుగుపెట్టకుండా దాయాదులు అడ్డుపడ్డారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ ఘటన లో పలువురు గాయపడ్డారు. రాజపుత్ర వీరుడు, మేవార్ పాలకుడు మహారాణా ప్రతాప్ వారసులైన మహేంద్ర సింగ్ మేవార్, అరవింద్ సింగ్ మేవార్‌ల మధ్య చాలా కాలంగా విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. राजतिलक के दिन मेवाड़ के इतिहास में ये घटना भी दर्ज हो गई.. राजपरिवार का झगड़ा सड़क पर आ गया!महा युद्ध इतिहास के पन्नो में लिखा जायेगा😂#udaipurnews #RajasthanNews pic.twitter.com/wcEfMueC9n — प्रोफेसर........? (@Jagdishjaat02) November 25, 2024 Also Read: Tirumala: తిరుమల శ్రీవారి హుండీలో పట్టపగలే చోరీ..ఆలస్యంగా వెలుగులోకి! ఈక్రమంలో మేవార్ మహారాజు మహేంద్రసింగ్ ఇటీవల కన్నుమూశారు. ఆయన మరణించిన 12 రోజలు తర్వాత మేవార్ తదుపరి పాలకుడిగా ఆయన కుమారుడు, బీజేపీ ఎమ్మెల్యే విశ్వరాజ్ సింగ్‌కి సోమవారం పట్టాభిషేకం జరిగింది. చిత్తోర్‌గఢ్ కోటలో ఈ కార్యక్రమం ఎంతో అట్టహాసంగా జరిగింది. అనంతరం సంప్రదాయం ప్రకారం వారి కులదైవం ఏకలింగనాథ్ ఆలయం, ఉదయ్‌పుర్‌లోని సిటీ ప్యాలెస్‌ను కొత్త మహారాజు సందర్శించాల్సి ఉంది. కానీ, ఈ పట్టాభిషేకంపై ఆగ్రహంతో రగిలిపోతున్న ప్రస్తుత ఉదయ్‌పుర్ రాజ కుటుంబానికి చెందిన ట్రస్ట్ ఛైర్మన్, మేనేజింగ్ ట్రస్టీగా ఉన్న అరవింద్ సింగ్. కొత్త రాజుకు వ్యతిరేకంగా ఓ ప్రకటన ప్రకటించారు. Also Read: ఫుట్‌పాత్ పైకి దూసుకెళ్లిన లారీ..ఇద్దరు చిన్నారులతో సహా ఐదుగురు ప్యాలెస్, ఏకలింగనాథ్ ఆలయం ఈయన నియంత్రణలోనే ఉండటంతో.. మహారాజు విశ్వరాజ్ సింగ్‌ను కోటలోకి రానివ్వబోమంటూ ఆదేశాలు జారీ చేశారు.ఈ పరిణామాలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా భారీ భద్రత ఏర్పాటుచేశారు. ఈక్రమంలోనే సోమవారం రాత్రి నూతన మహారాజు విశ్వరాజ్ సింగ్, తన మద్దతుదారులతో కలిసి కోట వద్దకు చేరుకున్నారు. కానీ, అరవింద్ సింగ్ కుమారుడు లక్ష్య రాజ్ సింగ్, ఆయన వర్గీయులు వీరిని లోనికి రాకుండా అడ్డుపడ్డారు. దీంతో విశ్వరాజ్ మద్దతుదారులు బారికేడ్లను దాటుకుని బలవంతంగా లోనికి వెళ్లేందుకు యత్నం చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. Also Read: AP: ఏపీకి ముంచుకొస్తున్న తుఫాన్..జాగ్రత్త అంటున్న అధికారులు! రాళ్ల దాడికి ప్రయత్నించగా.. పలువురు గాయపడ్డారు. దీంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసి వారిని చెదరగొట్టారు.ఇరు వర్గాల మధ్య ఘర్షణలతో మహారాజా విశ్వరాజ్ సింగ్ ఐదు గంటల పాటు ప్యాలెస్ బయటే నిలిచిపోయారు. ఈ వ్యవహారంలో కలెక్టర్ జోక్యం చేసుకోనున్నారు. గతేడాది రాజస్థాన్ ఎన్నికల్లో విశ్వరాజ్ రాజసమంద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన భార్య మహిమ కుమారి కూడా రాజసమంద్ ఎంపీగా కొనసాగుతున్నారు. Also Read: Sabarimala: తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు 62 ప్రత్యేక రైళ్లు! ఈ ఘటనపై మహారాజా మాట్లాడుతూ.. ఇది చాలా దురదృష్టకరమని అన్నారు. ‘నాకు మద్దతుగా నిలిచినందుకు అందరికీ కృతజ్ఞుడ్ని... ఒక వైపు ఆస్తులు ఉన్నాయి.. కానీ మనం ఆశీర్వాదాలు కోరుకునే సంప్రదాయాలు కూడా ఉన్నాయి. సమాజ నిబంధనలకు సంబంధించినంత వరకు ఇది తప్పు’ అని ఆయన చెప్పారు. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి