CM Revanth: నేనే ఆఖరి రెడ్డి ముఖ్యమంత్రి..! సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను ఆఖరి రెడ్డి సీఎం అయినా పర్వాలేదని అన్నారు. కులగణన సర్వే నా కోసం, నా పదవి కోసం చేయలేదని పేర్కొన్నారు. త్యాగానికి సిద్ధపడి కులాల వారిగా లెక్కలు తేల్చామన్నారు.

New Update
CM Revanth

CM Revanth

సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను ఆఖరి రెడ్డి సీఎం అయినా పర్వాలేదని అన్నారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నిర్వహించిన కులగణన, ఎస్సీ వర్గీకరణపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌లో సీఎం రేవంత్ మాట్లాడారు. '' నేను ఆఖరి రెడ్డి ముఖ్యమంత్రి అయినా పర్వాలేదు. మా నాయకుడు ఇచ్చిన మాట నిలబెట్టేందుకే సీఎంగా బాధ్యతలు తీసుకున్నాను. కులగణన సర్వే అనేది నా కోసం, నా పదవి కోసం చేయలేదు.   

Also Read: తెలంగాణ కాంగ్రెస్ లో కీలక మార్పులు.. మున్షీ ఔట్.. కొత్త ఇన్‌ఛార్జ్ ఎవరంటే?

త్యాగానికి సిద్ధపడి కులాల వారిగా లెక్కలు తేల్చాం. మా నాయకుడిని ఆదర్శంగా నిలబెట్టేందుకు కార్యకర్తగా మిగిలేందుకు కూడా నేను సిద్ధమే. కొందరు ఆరోపణలు చేస్తున్నట్లు కులగణన సర్వేలో ఎలాంటి లోపాలు జరగలేదు. ఇప్పుడు జరిగిన కులగణను సర్వేను తప్పుబడితే బీసీలు శాశ్వతంగా నష్టపోతారు. దేశం మొత్తం కూడా కులగణన సర్వే జరిపించాలని రాహుల్‌గాంధీ పార్లమెంటులో ప్రధాని మోదీని నిలదీశారు. ఈ సర్వే నిర్వహించకూడదని మోదీ, కేసీఆర్‌ కలిసికట్టుగా కుట్రకు పాల్పడుతున్నారు.  

Also Read: పుల్వామా అటాక్ చేసినవాళ్లను ఇండియన్ ఆర్మీ ఏం చేసిందో తెలుసా?

మోదీ కూడా పుట్టుకతో బీసీ కులస్థుడు కాదు. ఆయన గుజరాత్ సీఎం అయ్యాక తన కులాన్ని బీసీ జాబితాలో చేర్చుకున్నారు. సర్టిఫికేట్‌లో మాత్రమే మోదీ బీసీ వ్యక్తి. ఆయన వ్యక్తిత్వం అగ్రకులమే. కులగణన నిర్వహిస్తే చట్ట ప్రకారం రిజర్వేషన్లు సంపాదించుకోవచ్చు. అధికారిక లెక్కలు ఉంటే బీసీ రిజర్వేషన్లు పెంచాలని సుప్రీంకోర్టు కూడా తీర్పునివ్వొచ్చు. కులగణన సర్వే రెండో విడత అవకాశాన్ని వినియోగించుకోవాలి. కేసీఆర్, కేటీఆర్‌, హరీశ్‌రావు ఇంటిముందు మేలుకోలుపు డప్పు కొట్టాలని బీసీ సంఘాలను కోరుతున్నాను. సర్వేలో పాల్గొనకపోతే సామాజిక బహిష్కరణే శిక్ష అని'' సీఎం రేవంత్ అన్నారు. 

Also Read: కేరళలో ఏనుగుల బీభత్సం.. ముగ్గురు స్పాట్ డెడ్.. మరో 36 మంది: వీడియో చూశారా!

#telangana #modi #rtv-telugu #caste-census #cm revanth
Advertisment
Advertisment
తాజా కథనాలు