Hyderabadకు మొదటిసారి ఉపరాష్ట్రపతి.. రాజ్‌భవన్‌లో గవర్నర్, CMతో భేటీ

ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌ హైదరాబాద్‌ పర్యటన సందర్భంగా రాజ్‌భవన్‌లో గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ తేనీటి విందు ఏర్పాటు చేశారు. గవర్నర్‌ తేనీటి విందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ తదితరులు హాజరయ్యారు.

New Update
Vice President Radhakrishnan

ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌ హైదరాబాద్‌ పర్యటన సందర్భంగా రాజ్‌భవన్‌లో గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ తేనీటి విందు ఏర్పాటు చేశారు. గవర్నర్‌ తేనీటి విందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ తదితరులు హాజరయ్యారు. అంతకు ముందు బేగంపేట విమానాశ్రయంలో గవర్నర్‌, సీఎం.. ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్‌కు స్వాగతం పలికారు. ఉపరాష్ట్రపతి హోదాలో రాధాకృష్ణన్ తెలంగాణ రాష్ట్రానికి రావడం ఇదే మొదటిసారి.

రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ , ఇతర ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారితో పాటు ఇతర ఉన్నతాధికారులు ఉప రాష్ట్రపతి గారికి స్వాగతం పలికారు. 

Advertisment
తాజా కథనాలు