ఆ విభాగాల్లో పెట్టుబడులు పెట్టండి.. ఫాక్స్‌కన్‌ కంపెనీలో సీఎం రేవంత్

హైదరాబాద్‌లోని కొంగరకలాన్‌లో ఉన్న ఫాక్స్‌కాన్ కంపెనీని సీఎం రేవంత్‌ సందర్శించారు. రాష్ట్రంలో మరిన్ని విభాగాల్లో పెట్టుబడులు పెట్టాలని సంస్థను కోరారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్, లిథియం బ్యాటరీ విభాగాల్లోనూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని సూచించారు.

FOxconn
New Update

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే కంపెనీలకు మౌలిక సదుపాయాలు కల్పించే విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని సీఎం రేవంత్ అన్నారు. సోమవారం హైదరాబాద్‌ శివారులోని కొంగరకలాన్‌లో ఉన్న ఫాక్స్‌కాన్ కంపెనీని సీఎంతో పాటు ఐటీశాఖ మంత్రి శ్రీధర్ బాబు సందర్శించారు. కంపెనీ ప్రతినిధులతో సమావేశమై కంపెనీ పురోగతి, ఇతర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ ఫాక్స్‌కాన్ ఛైర్మన్ యాంగ్‌ లియూతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.  

Also Read: లవర్‌ కోసం ఆ అమ్మాయి ఏం చేసిందో తెలుసా?

అన్ని విధాలుగా సహకరిస్తాం

కంపెనీకి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అన్ని విధాలుగా సహకరిస్తామని మరోసారి సీఎం భరోసా ఇచ్చారు. కంపెనీ విస్తరణలో భాగంగా తెలంగాణలో మరిన్ని విభాగాల్లో పెట్టుబడులకు ముందుకు రావాలని కోరారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్, లిథియం బ్యాటరీ విభాగాల్లోనూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని అభ్యర్థించారు. సీఎం రేవంత్ పర్యటన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, ప్రభుత్వ ఐటీ విభాగం ఉన్నతాధికారులు ఫాక్స్‌కాన్ ప్రతినిధులు సైతం పాల్గొన్నారు. 

Also Read: వ్యక్తి ఖాతాలోకి పొరపాటున రూ.16 లక్షలు.. చివరికి ఊహించని షాక్

24 దేశాల్లో ఫాక్స్‌కాన్ సంస్థ

2023 మార్చిలో తెలంగాణలో తాము పెట్టుబడులు పెడతామి ఫాక్స్ కాన్ కంపెనీ ప్రకటన చేసింది. ఎలక్ట్రానిక్ పరికరాలు, ఉపకరణాలు తయారు చేసే ఈ సంస్థ సంబంధిత ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసి.. లక్ష మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని గతంలోనే రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. యాపిల్ ఐ ఫోన్లను సైతం ఫాక్స్‌కాన్ సంస్థ తయారు చేస్తుంది. దీనికి సంబంధించిన ప్రధాన క్లైంట్స్‌లో అమెజాన్, గూగుల్, అలీబాబా గ్రూప్, షియోమి, మైక్రోసాఫ్ట్, నోకియా డెల్, ఫేస్‌బుక్‌, సోని వంటి తదితర దిగ్గత సంస్థలు ఉన్నాయి. అమెరికా, యూర్, చైనా, భారత్‌ తదితర దేశాలతో సహా మొత్తంగా 24 దేశాల్లో ఫాక్స్‌కాన్ సంస్థలు ఉన్నాయి. ఇక ఇండియాలో తెలంగాణలోని కొంగర కలాన్, ఏపీలో శ్రీ సిటి, కర్ణాటకలో బెంగళూరు, తమిళనాడులో శ్రీ పెరంబుదూర్‌లో ఫాక్స్‌కాన సంస్థకు కర్మాగారాలు ఉన్నాయి.  

Also read: హైదరాబాద్-విజయవాడ రూట్లో ప్రయాణించే వారికి అదిరిపోయే శుభవార్త!

ఇదిలాఉండగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 17న ఢిల్లీకి వెళ్లనున్నారు. 17న ఢిల్లీలో సీడబ్ల్యుసీ వర్కింగ్ కమిటీ సమావేశం ఉంది. ఈ సమావేశానికి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఆయనతో పాటు తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి దామోదర రాజనర్సింహ, పార్టీ నేత వంశీచంద్ రెడ్డి తదితరులు హాజరు కానున్నారు.

Also Read: ఎన్నికల వేళ షిండే సర్కార్ సంచలన నిర్ణయం.. ఇకనుంచి నో టోల్‌ ఫీజు!

 

#cm-revanth #sridar-babu #foxconn #foxconn-chairman-yang-liu #minister-sridar-babu
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe