త్వరలో డయల్ 100, 108, 101 నెంబర్లు బంద్.. వీటన్నింటికి ఒకటే నెంబర్..!

‘డయల్‌‌ 100, 108, 101’ స్థానంలో డయల్ 112 సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు, బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు ఇకపై ఒకే నంబర్​ వినియోగంలోకి రానుంది. సీఎం రేవంత్‌‌రెడ్డి త్వరలోనే ఈ సేవలను అందుబాటులోకి తేనున్నారు.

New Update
dail 112 (1)

ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎమర్జెన్సీ సేవలు త్వరలో కనుమరుగు కాబోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా డయల్ 100,108,101 సేవలు ఇక కనిపించకుండా పోయే అవకాశం దగ్గర్లోనే ఉంది. వీటి స్థానంలో డయల్ 112 సేవలు అందుబాటులోకి రానున్నాయి. త్వరలోనే ఈ డయల్ 112 సేవలను సీఎం రేవంత్ రెడ్డి అందుబాటులోకి తీసుకురానున్నారు. 

ఇది కూడా చూడండి: ప్రభుత్వ ఉద్యోగులకు రైతు భరోసా.. రేవంత్ సర్కార్ కీలక అప్డేట్!

దీనిని టీజీ పేరుతో ఒక ప్రత్యేక లోగోను ఇప్పటికే అధికారులు సిద్ధం చేశారు. ఎమర్జెన్సీ టైంలో ప్రజలు, బాధితుల నుంచి ఫిర్యాదులు పొందేందుకు ఇకపై ఒకే నెంబర్‌ను వినియోగంలోకి తీసుకొస్తున్నారు. ఇక ఇందుకు సంబంధించి పోలీసులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా దీనిని బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కేంద్రంగా ఈ ఆపరేట్ చేయనున్నారు. 

ఇది కూడా చదవండి: SBIలో 13,735 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. అర్హత, ఇతర వివరాలివే!

త్వరలో డయల్ 112 సేవలు

దీంతో ఇకనుంచి ఈ డయల్ 112 నెంబర్‌తో అంబులెన్స్ 108, పోలీస్ 100, ఫైర్ 101, విమెన్ సేఫ్టీ, చైల్డ్ వెల్ఫేర్ సహా మరిన్ని ఎమర్జెన్సీ సేవలు అందబోతున్నాయి. కాగా ఇది ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఉంది. ఎమర్జెన్సీ సమయంలో భాదితులు, ప్రజల నుంచి ఫిర్యాదులు పొందేందుకు ఒకే అత్యవసర నెంబర్ ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 112 నెంబర్‌ను ఇప్పటికే అందుబాటులోకి తీసుకువచ్చింది. 

ఇది కూడా చూడండి: తానుపారిపోవాలని అనుకోలేదు.. మొదటిసారి స్పందించిన అసద్ 

ఇందులో భాగంగానే డయల్ 100కి వచ్చిన కాల్స్ 112 ద్వారా ఆయా డిపార్ట్‌మెంట్‌లకు చేరుతున్నాయి. అయితే డయల్ 112పై ప్రజల్లో అవగాహన వచ్చేంతవరకు డయల్ 100 అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. అప్పటి వరకు డయల్ 100కి వచ్చే కాల్స్ ఆటోమేటిక్‌గా 112కి ట్రాన్సఫర్ చేయబడతాయని పేర్కొన్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు