/rtv/media/media_files/2025/08/17/cm-revanth-reddy-kcr-2025-08-17-08-26-43.jpg)
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ కు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. తానెవరినీ శత్రువుగా చూడనని చెప్పారు. తాను శత్రువుగా చూడాలంటే వారికి ఓ స్థాయి ఉండాలన్నారు. అందెశ్రీ ప్రచురించిన హసిత భాష్పాలు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం ఈ కామెంట్స్ చేశారు. తనకు కు నచ్చనివారిపై అధికారం ప్రయోగించే మూర్ఖుడిని కాదన్నారు సీఎం రేవంత్. ప్రతీకార రాజకీయాలకు తాను దూరమన్న సీఎం.. కర్మసిద్దాంతాన్ని తాను బలంగా నమ్ముతానని తెలిపారు. తాను గెలువడమే వారికి పెద్ద శిక్ష అంటూ పరోక్షంగా కేసీఆర్ కు కౌంటర్ వేశారు రేవంత్.
నేను ఎవరినీ శత్రువులుగా చూడను.. అలా చూడాలన్నా వాళ్ళకి ఆ స్థాయి ఉండాలి – రేవంత్ రెడ్డి pic.twitter.com/ENmc0FLU9k
— Telugu Scribe (@TeluguScribe) August 16, 2025
2040 వరకు రాజకీయాల్లో
ఇక తాను 2040 వరకు రాజకీయాల్లో కొనసాగుతానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణకు రెండో సీఎం కావడం తన అదృష్టమన్నారు. రాష్ట్ర ప్రజలు నా భుజాలపై పెద్ద బాధ్యత పెట్టారని... ఈ అవకాశాన్ని వారి అభ్యున్నతికే వినియోగిస్తానన్నారు. ప్రజలపై అధికారాన్ని వాడే మూర్ఖుడిని తాను కాదని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం తాను పదవిని వాడనని పేర్కొన్నారు.
ఇక దేశానికి నాయకత్వం వహించాలనే దురాశతో ఉన్నది పోగొట్టుకున్నారంటూ సీఎం రేవంత్ కేసీఆర్ పై పరోక్షంగా సెటైర్లు వేశారు. తెలంగాణ పేరు, పేగు బంధం కూడా తెంచుకున్నారని అన్నారు. ప్రపంచంలో గొప్ప రాష్ట్రంగా తెలంగాణను మారుస్తానని, 2047 నాటికి $3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తన ముందున్న లక్ష్యమన్నారు రేవంత్ . రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యంతో పేదల ఆత్మగౌరవాన్ని తమ ప్రభుత్వం పెంచామన్నారు సీఎం.
మరోవైపు రాష్ట్రానికి భారీ వర్షసూచన ఉన్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వర్ష ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాలకు SDRF, NDRF సిబ్బంది ముందుగానే వెళ్తే వారితో కలెక్టర్లు సమన్వయం చేసుకుంటారని చెప్పారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస శిబిరాలకు తరలించాలన్నారు. అంటువ్యాధులు ప్రబలే ఆస్కారం ఉన్నందున వైద్యారోగ్యశాఖ అప్రమత్తం కావాలని సీఎం ఆదేశాలు కూడా జారీ చేశారు.