CM Revanth Reddy : తెలంగాణలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు అమలు చేయడం వల్ల గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇందిరమ్మ కమిటీల ద్వారా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వచ్చిన తరువాత ఇళ్లులేని వారు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఇల్లు కట్టుకునేందుకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అందిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇది కూడా చదవండి: నేడు ఢిల్లీకి భట్టి విక్రమార్క.. అధిష్టానంతో కీలక భేటీ!
కొత్త తలనొప్పిగా మారొద్దు...
ఇటీవల ఇందిరమ్మ ఇళ్ల లబ్ధి దారులను ఎంపిక చేసేందుకు తెలంగాణ సర్కార్ ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలను గ్రామాల్లో, మున్సిపాలిటీలలో అమల్లోకి తెచ్చేలా చూడాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. అయితే.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కమిటీలపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. లబ్ధి దారుల ఎంపిక విషయంలో పక్షపాతం చూపుతారనే చర్చ కూడా జోరందుకుంది. అయితే ఈ కమిటీ వల్ల రేవంత్ సర్కార్ కు లాభం ఎంత ఉందో నష్టాలు కూడా అంతే ఉన్నాయి. ఒకవేళ ఇళ్ల మంజూరు విషయంలో ఈ కమిటీ పక్షపాతంగా వ్యవరిస్తే గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఇది ముందే గమనించిన సీఎం రేవంత్ లబ్ధి దారుల ఎంపిక విషయంలో వివక్ష చూపొద్దని.. అర్హులైన లబ్దిదారులను మాత్రమే ఎంపిక చేయాలని ఎక్కడైనా పక్షపాతం చూపించినట్లుగా ఆరోపణలు వస్తే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని చెప్పారు.
ఇది కూడా చదవండి: జగన్‌కు బిగ్ షాక్.. జనసేనలోకి వైసీపీ ఎమ్మెల్యేలు!
రుణమాఫీ తెచ్చిన తంటా...
ఎన్నికల సమయంలో ఇచ్చిన రూ.2లక్షల రుణమాఫీ హామీని అమలు చేసింది రేవంత్ సర్కార్. అయితే.. ప్రతిపక్షాలకు ప్రభుత్వం చేపట్టిన రుణమాఫీ కార్యక్రమం పెద్ద ఆయుధంగా మారింది. రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. రెండు ;లక్షల రూపాయల రుణమాఫీ చేయలేదని విమర్శలు చేసింది. మరోవైపున కాంగ్రెస్ నేతలు రుణమాఫీపై రోజుకో మాట మాట్లాడడం ప్రభుత్వంపై వ్యతిరేకతకు కారణమైంది. రూ.2లక్షల వరకు రుణమాఫీ చేశామని కొందరు మంత్రులు సైతం చెప్పగా.. మరికొంత మంది కాంగ్రెస్ నేతలు మొత్తం రుణమాఫీ చేశామని చెప్పడం రైతులను గందరగోళంలోకి నెట్టింది. తాజాగా మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఈ నెల ఆఖరి లోగా రుణమాఫీ ముగుస్తుందని హామీ ఇచ్చారు. అలాగే త్వరలో రైతు భరోసా కింద ఎకరాకు రూ.7500 ఇస్తామన్నారు. గ్రామాల్లో ప్రతిష్ఠాత్మకంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రుణమాఫీ అంశం వివాదాల చుట్టూ నడుస్తూ వస్తోంది. కాగా రుణమాఫీ అంశంపై జరిగిన తప్పులను సరి చేసుకుంటూ.. ఇందిరమ్మ కమిటీల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది.
ఇది కూడా చదవండి: నేడు హర్యానాకు సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికలే టార్గెట్....
ప్రభుత్వంపై కాస్త ఉన్న వ్యతిరేకతను కూడా తొలిగించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామాల్లో మూడు రంగుల జెండా ఎగురవేయాలని వ్యూహాలు చేస్తున్నారు. అయితే.. తెలంగాణలో కులగణన చేసిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ నెల లేదా జనవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగొచ్చు అనే సమాచారం అందుతోంది. ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలనే ఆలోచనలో సర్కార్ ఉంది. ప్రధాన హామీలైన... పెన్షన్ పెంపు, 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా, రేషన్ కార్డుల జారీ వంటివి అమలు చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం. ఇచ్చిన హామీలను అమలు చేసి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే కాంగ్రెస్ గ్రామాల్లో పట్టు సాధించి విజయకేతనం ఎగురవేస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇది కూడా చదవండి: పైసా పనిలేదు.. రాష్ట్రానికి లాభం లేదు.. రేవంత్‌పై కేటీఆర్ ఫైర్!