ట్రాన్స్‌జెండర్లకు రూ.20 వేల జీతం.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం!

హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు రేవంత్ సర్కార్ వాలంటీర్లను ఏర్పాటు చేయనుంది. ట్రాఫిక్‌ వాలంటీర్లుగా ట్రాన్స్‌జెండర్‌ల నియామకంపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. రూ.15వేల నుంచి రూ.20వేల వరకు జీతం ఉంటుంది.

transgenders
New Update

హైదరాబాద్ నగరంలో అతి పెద్ద సమస్య ఏదన్నా ఉంది అంటే అది ట్రాఫిక్ సమస్య అనే చెప్పాలి. అడుగడుగునా గంటల తరబడి వాహనాలు నిలిచిపోతాయి. ఇక వర్షం పడిందంటే గందరగోలమే. దారిపొడువునా కిలో మీటర్ల మేర వాహనాలు స్థంబించిపోతాయి. వాహనదారులు ఎన్నో ఇబ్బందులు పడతారు. ఇక ఆ సమస్యకు చెక్ పెట్టేందుకు రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 

ఇది కూడా చదవండి: రేపే గ్రూప్-3 పరీక్ష.. అభ్యర్థులకు నిపుణుల కీలక సూచన!

తెలంగాణలో వాలంటీర్ల వ్యవస్థ

గతంలో ఆంధ్రప్రదేశ్ లో తీసుకొచ్చిన వాలంటీర్ల వ్యవస్థ ఎంతగా సక్సెస్ అయిందో పెద్దగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఇప్పుడు అలాంటి సేవలనే రేవంత్ సర్కార్ తెలంగాణలో అందుబాటులోకి తీసుకురాబోతుంది. అవును మీరు విన్నది నిజమే.. త్వరలో తెలంగాణలో వాలంటీర్ల వ్యవస్థ రాబోతుంది. అయితే అది ఏపీలో మాదిరి కాదు. 

హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్లను ఏర్పాటు చేయనుంది. అయితే అది మేల్ అండ్ ఫీమేల్స్ కు కాదు. ట్రాన్స్ జెండర్ లకు సహాయం చేసేందుకు రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. 

ఇది కూడా చదవండి: సిఫార్సులకు విరుద్ధంగా గ్రౌటింగ్‌.. ఎన్డీఎస్‌ఏ లేఖలో బయటపడ్డ సంచలనాలు

ఇందులో భాగంగానే హైదరాబాద్ లో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను చెక్ పెట్టేందుకు ట్రాఫిక్ వాలంటీర్లుగా ట్రాన్స్ జెండర్లను నియమించేందుకు దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. దీంతో ట్రాఫిక్ నిర్వహణలో ఇప్పుడు ట్రాన్స్ జెండర్లు భాగం కానున్నారు. ఇక ట్రాఫిక్ నిర్వహణలో ఉండే వాలంటీర్ల కోసం స్పెషల్ గా డ్రెస్ కోడ్.. హోంగార్డుల మాదిరిగానే వేతనాన్ని ఖరారు చేయాలని అధికారులను కోరారు. 

దీనిబట్టి వారి జీతం నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ఉంటుంది. ఈ నిర్ణయాన్ని త్వరగా అమలు చేయాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అయితే తొలి దశలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండే జోన్ లలో ట్రాఫిక్ వాలంటీర్లుగా ట్రాన్స్ జెండర్లను నియమించనున్నారు. వీరు డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ పాయింట్ల వద్ద కూడా చెకింగ్ చేయనున్నారు. 

#cm-revanth-reddy #hyderabad #transgenders
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe