జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పై సీఎం సమీక్ష.. కాంగ్రెస్ అభ్యర్థి ఇతనేనా..?

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి గోపీనాథ్ అకస్మిక మరణంతో త్వరలో ఉపఎన్నికలు రానున్నాయి. దీంతో ఉప ఎన్నిక అంశానికి సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డి తన నివాసంలో సమీక్ష చేపట్టారు. ఆదివారం జూబ్లీహిల్స్‌ ఎన్నికపై పలువురు కాంగ్రెస్‌ నేతలతో చర్చించారు.

New Update
Jubilee Hills by-election

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో త్వరలో ఉపఎన్నికలు రానున్నాయి. దీంతో ఉప ఎన్నిక అంశానికి సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డి తన నివాసంలో సమీక్ష చేపట్టారు. ఆదివారం జూబ్లీహిల్స్‌ ఎన్నికపై పలువురు కాంగ్రెస్‌ నేతలతో చర్చించారు. పీసీసీ చీఫ్‌ మహేష్‌ గౌడ్‌, జూబ్లీహిల్స్‌ ఇంచార్జ్‌ మంతరులు పొన్నం ప్రభాకర్‌, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్‌లతో సర్వే ఏజెన్సీల నుంచి పలువురు హాజరయ్యారు. 

సెప్టెంబర్ నెలాఖరులో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. దీంతో జూబ్లీహిల్స్‌లో అభివృద్ధి పనులు, అభ్యర్థి ఎంపికపై మంత్రులతో సీఎం చర్చిస్తున్నారు. జూబ్లీహిల్స్‌ రేసులో నవీన్‌ యాదవ్‌, బొంతు రామ్మోహన్‌, అంజన్‌ కుమార్‌ యాదవ్‌లు పోటీలు ఉన్నారు. జూబ్లీహిల్స్‌ ఎన్నికపై సీక్రెట్‌ సర్వే రిపోర్ట్‌ను సీఎంకు అందజేశారు పీసీసీ చీఫ్‌.

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో తాను పోటీలో ఉన్నానని కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అంజన్‌ కుమార్‌ యాదవ్‌ అంటున్నారు. తాను సికింద్రాబాద్‌ ఎంపీగా రెండు సార్లు గెలిచానని, జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ అభవృద్ధి కోసం కృషి చేశానన్నారు. ఎంపీ ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేశానన్నారు. మీడియాతో చిట్‌చాట్‌లో  భాగంగా తన మనసులోని మాటను వెల్లడించారు అంజన్‌ కుమార్‌ యాదవ్‌. 

‘నా సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలి. అందులో భాగంగా నాకు టికెట్ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలి ఉమ్మడి ఏపీ నుండి యాదవ సామాజికవర్గంకి మంత్రి పదవి కేటాయించారు. నాకన్న సీనియర్లు ఎవరు లేరు....నాకు అన్ని అర్హతలు ఉన్నాయి. హైదరాబాద్ నుండి ప్రాతినిథ్యం లేదు కాబట్టి నాకు అవకాశం ఇచ్చి మంత్రి ఇవ్వాలి. కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి అండగా నేను ఉన్న ఇప్పుడు నాకు అవకాశం ఇవ్వాలి. జూబ్లీహిల్స్‌లో సర్వే చేస్తే అంజన్ కుమార్ యాదవ్ పేరు వస్తుంది’ అని పేర్కొన్నారు.

Advertisment
తాజా కథనాలు