/rtv/media/media_files/2025/02/07/ou0cGWGBuFaugXeq3bsN.jpg)
Kameshwar Choupal
రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ శాశ్వత సభ్యుడు, బీహార్ మాజీ ఎమ్మెల్సీ కామేశ్వర్ చౌపాల్ కన్నుమూశారు. ఆయన గత కొన్ని రోజులుగాఅనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈయన బీహార్‌లోని సుపాల్ నివాసి. రామ ఉద్యమం నుండి ఇప్పటివరకు కామేశ్వర్ చౌపాల్ అయోధ్యతో అనుబంధం కలిగి ఉన్నారు. అయోధ్య రామాలయ నిర్మాణానికి కామేశ్వర్ చౌపాల్ 1989 నవంబర్ 9న అయోధ్యలో మొదటి ఇటుకను వేశారు. ఆ సమయంలో ఆయన విశ్వ హిందూ పరిషత్ (VHP) లో వాలంటీర్‌గా ఉన్నారు.
राम मंदिर की पहली ईंट रखने वाले, पूर्व विधान पार्षद, दलित नेता, श्री राम जन्मभूमि ट्रस्ट के स्थाई सदस्य, विश्व हिंदू परिषद के प्रांतीय अध्यक्ष रहे, श्री कामेश्वर चौपाल जी के निधन की खबर सामाजिक क्षति है। उन्होंने सम्पूर्ण जीवन धार्मिक और सामाजिक कार्यों में समर्पित किया। मां… pic.twitter.com/95eci6fjDK
— BJP Bihar (@BJP4Bihar) February 7, 2025
హిందూ పరిషత్ ని విడిచిపెట్టి
1991లో కామేశ్వర్ చౌపాల్ విశ్వ హిందూ పరిషత్ ని విడిచిపెట్టి బీజేపీలో చేరారు. ఆ ఎన్నికల్లో పార్టీ ఆయన్ను పార్లమెంటరీ ఎన్నికల్లో పోటీ చేయించగా ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో రెండోసారి పోటీ చేయగా మరోసారి కూడా ఓటమిని చవిచూశారు. ఆ తరువాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కాగా 2002 నుండి 2014 వరకు రెండుసార్లు బీహార్ కు ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యారు.
కామేశ్వర్ చౌపాల్ 1956 ఏప్రిల్ 24న బీహార్‌లోని మధుబని జిల్లాలో జన్మించారు. రాజకీయాల కంటే, కామేశ్వర్ చౌపాల్ రామమందిర ఉద్యమంతోనే ఎక్కువగా గుర్తుండిపోతారు. చౌపాల్ జీ ఇచ్చిన 'రోటీ కే సాథ్ రామ్' నినాదం ఆ సమయంలో బాగా ప్రాచుర్యం పొందింది.
Also Read : కానిస్టేబుల్ కాదు కామాంధుడు.. కేసు పెట్టడానికి వస్తే గర్భవతిని చేసి