స్కూళ్లలో ఫుడ్ పాయిజన్ పై రేవంత్ సీరియస్.. అధికారులకు కీలక ఆదేశాలు! TG: ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. విద్యార్థులకు ఆహారం అందించే విషయంలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు రుజువైతే వారిని ఉద్యోగాల నుంచి తొలగించేందుకు వెనుకాడమని స్పష్టం చేశారు. By V.J Reddy 28 Nov 2024 in తెలంగాణ మహబూబ్ నగర్ New Update షేర్ చేయండి CM Revanth Reddy: తెలంగాణలోను ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్స్‌లలో వరుసగా జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలపై సీఎం రేవంత్ రెడ్డి అరా తీశారు. ఈ క్రమంలో అన్ని జిల్లాల కలెక్టర్లకు కీలక ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాలు, గురుకుల పాఠశాల్లలో విద్యార్థులను కన్న బిడ్డల్లా చూడాలని, వారికి పరిశుభ్రమైన వాతావరణంలో పౌష్టికాహారం అందించడంలో ఎటువంటి అలక్ష్యానికి తావు ఇవ్వవద్దని సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు సూచించారు. ఇది కూడా చదవండి: ఈ నెల 30న అకౌంట్లోకి డబ్బు జమ! ఉద్యోగాల నుంచి తొలిగిస్తాం... విద్యార్థులకు అందించే ఆహారానికి సంబంధించి చోటుచేసుకుంటున్న ఘటనలపై ముఖ్యమంత్రి పలుమార్లు సమీక్షించారు. కలెక్టర్లు తరచూ పాఠశాలల, వసతిగృహాలు, గురుకుల పాఠశాలలను తనిఖీ చేయాలని.. అనంతరం అందుకు సంబంధించిన నివేదికలను సమర్పించాలని సీఎం కలెక్టర్లను ఆదేశించారు. పలుమార్లు ఆదేశాలు ఇచ్చినా పొరపాట్లు చోటుచేసుకుంటుండంపై సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఆహారం అందించే విషయంలో ఉదాశీనంగా వ్యవహరించే అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు. విద్యార్థులకు ఆహారం అందించే విషయంలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు రుజువైతే వారిని ఉద్యోగాల నుంచి తొలగించేందుకు వెనుకాడమని సీఎం స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: వైసీపీ మాజీ మంత్రి పీఏ ఇంట్లో ఏసీబీ దాడులు! విద్యార్థులకు మంచి విద్య అందించాలనే ఉద్దేశంతో వేల సంఖ్యలో ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టడంతో పాటు వారికి పౌష్టికాహారం అందించేందుకు డైట్ ఛార్జీలు పెంచిన విషయాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తు చేశారు.. విద్యార్థుల విషయంలో తాము సానుకూల నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ కొందరు ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, అటువంటి శక్తుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని, బాధ్యులైన వారిని చట్టప్రకారం శిక్షిస్తామని ముఖ్యమంత్రి హెచ్చరించారు. వసతిగృహాల్లో ఆహారం విషయంలో కొందరు ఉద్దేశపూర్వకంగా పుకార్లు సృష్టించడంతో పాటు లేని వార్తలను ప్రచారం చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారని.... వారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. Also read: మతం మారి ఆ రిజర్వేషన్లు పొందడం రాజ్యంగాన్ని మోసం చేయడమే: సుప్రీంకోర్టు Also Read: జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ ప్రమాణ స్వీకారం..రానున్న ఖర్గే,రాహుల్ #government schools #food-poison #collectors #cm-revanth-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి