/rtv/media/media_files/2025/09/30/bathukamma-guinness-world-record-2025-09-30-18-39-15.jpg)
Bathukamma Guinness World Record
Bathukamma Guinness Record 2025: సోమవారం తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన బతుకమ్మ వేడుక రెండు గిన్నిస్ రికార్డులు సాధించిన విషయం తెలిసిందే. కాగా ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, టూరిజం డిపార్ట్మెంట్ ఎండీ క్రాంతి లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రెండు రికార్డుల పత్రాలను ముఖ్యమంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి, ఉన్నతాధికారులు. సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 29వ తేదీ సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా గిన్నిస్ బుక్ రికార్డు కోసం భారీ బతుకమ్మ ను ఏర్పాటు చేశారు. ఈ వేడకలో పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలంతా ఆడిపాడారు. ఈ సందర్భంగా 63 అడుగుల ఎత్తుతో ఏర్పాటు చేసిన తెలంగాణ మహా బతుకమ్మకు గిన్నిస్ రికార్డు లభించింది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుక 63 అడుగుల బతుకమ్మ చుట్టూ1354 మంది మహిళలు తిరుగుతూ ఆడిపాడారు. హైదరాబాద్‌లోని సరూర్ నగర్ మైదానంలో నిర్వహించిన బతుకమ్మ ఉత్సవం అతిపెద్ద జానపద నృత్యంగా, అలాగే అతిపెద్ద బతుకమ్మగా రెండు గిన్నిస్ రికార్డులు సాధించింది.
కాగా ఈ భారీ బతుకమ్మ ఎత్తు 63.11 అడుగులు. వెడల్పు 36 అడుగులు. ఇంతటి భారీ బతుకమ్మను పేర్చేందుకు 10.7 టన్నుల వరకు వివిధ రకాల పూలను ఉపయోగించారు. 300 మంది మూడు రోజుల పాటు శ్రమించి ఈ మెగా బతుకమ్మను రూపొందించారు. 11 అంతరాలుగా పేర్చిన ఈ మహా బతుకమ్మ కోసం తొమ్మిది రకాల పూలను వాడారు. ఎల్బీనగర్‌లోని సరూర్‌నగర్‌లోని ఇండోర్ స్టేడియంలో సోమవారం ‘మన బతుకమ్మ’ ఉత్సవాల్లో భాగంగా ఈ బతుకమ్మ స్థానికులను అలరించింది. కాగా ఈ గిన్నిస్ రికార్డులను మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క, మేయర్ గద్వాల విజయలక్ష్మిలు అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజాగాయనీ విమలక్క, ప్రముఖ సినీ గాయని గీత తమ గాత్రంతో ఆకట్టుకున్నారు. వేడుకల్లో మిస్ వరల్డ్, థాయ్ అమ్మాయి ఓపెల్ సుచాట చువాంగ్‌శ్రీ, మిస్ అమెరికా, మిస్ ఏషియా, మిస్ యూరప్, మిస్ కరేబియన్, మిస్ అర్జెంటీనా తదితరులు పొల్గొని బతుకమ్మ ఆడి సందడి చేశారు.