Cast Census:
కులగణన ఎక్స్‌రే కాదు..మెగా హెల్త్ క్యాంప్ లాంటిది. కులగణన ఆధారంగా సంక్షేమ పథకాలు తొలగించం. కులగణనతో ఎవరికీ ఇబ్బంది ఉండదు. కులగణనపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు. జనాభా ఆధారంగా రిజర్వేషన్లు రావడానికి కులగణన అవసరం అని స్పష్టం చేశారు మఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సమాజంలో మార్పులకు అనుగుణంగానే ఈ సర్వే చేపట్టామని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజలకు 50 శాతానికి పైగా రిజర్వేషన్లు కావాలంటే కులగణన జరగాలని అన్నారు.
అలాగే తెలంగాణలో విద్య, ఉపాధి అవకాశాలు పెరగాలంటే కులగణన జరగాలని రేవంత్ రెడ్డి చెప్పారు. కులగణనపై అపోహలు తొలగించే బాధ్యత విద్యార్థులదేనని.. మీ తల్లిదండ్రులకు, చుట్టుపక్కలవారికి కులగణనపై అవగాహన కల్పించాలని సీఎం పిలుపునిచ్చారు. ఎవరు అడ్డు వచ్చినా కులగణన ఆగదని.. 2025లో జరిగే జనగణనలో కూడా కులగణన చేసేలా కేంద్ర ప్రభుత్వ మెడలు వంచుతామని హాట్ కామెంట్స్ చేశారు. కులగణనతో ఎవరికీ ఎలాంటి నష్టం ఉండదని.. ఎవరి ఆస్తులు తీసుకోమని క్లారిటీ ఇచ్చారు.
Also Read: TS:హోమ్ గార్డులుగా ట్రాన్స్ జెండర్లు..సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన