Bhu Bharati : భూభారతి చట్టంపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు ..

గత ప్రభుత్వం అనాలోచితంగా ధరణి తీసుకురావడంతో ఎన్నో సమస్యలు తలెత్తాయని సీఎం రేవంత్ అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా భూ భారతి చట్టాన్ని 69 లక్షల కుటుంబాల రైతులకు అంకితం చేస్తున్నామని తెలిపారు. పూర్తి సమాచారం కోసం టైట్‌పై క్లిక్ చేయండి.

New Update
CM Revanth

CM Revanth

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూభారతి పోర్టల్‌ను సీఎం రేవంత్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా శిల్పకళా వేదికలో ఆయన మాట్లాడారు. '' భూగరిష్ఠ పరిమితి చట్టం తెచ్చి భూస్వాముల నుంచి కాంగ్రెస్ మిగులు భూములు సేకరించింది. ఇందిరాగాంధీ ఆ భూములను పేదలకు పంచారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం చాలా అధ్యయనం చేసి భూ చట్టాలను చేసింది. 

Also Read: వేలంలో ‘గోల్కొండ బ్లూ’ వజ్రం.. దీని ధర తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవడమే

కానీ గత పాలకులు మంచిగా ఉన్న ఉన్న చట్టాన్ని రద్దు చేసి ధరణిని తీసుకొచ్చారు. దీన్ని అనాలోచితంగా తీసుకురావడంతో ఎన్నో సమస్యలు తలెత్తాయి. అంబేద్కర్ జయంతి సందర్భంగా భూ భారతి చట్టాన్ని 69 లక్షల కుటుంబాల రైతులకు అంకితం చేస్తున్నాం. రెవెన్యూ సిబ్బందిని గత ముఖ్యమంత్రి చాలాసార్లు ఎంతో అవమానించారు. రెవెన్యూ సిబ్బంది అంటే ప్రజలను దోచుకునే వాళ్లుగా చిత్రీకరించారు. ఎలుకు దూరిందని ఇల్లు కాల్చేసే వ్యవహారానికి పాల్పడ్డారు. 

Also Read: చచ్చాడు వెధవ.. 5ఏళ్ల చిన్నారిని రేప్ చేసిన కామాంధుడు-గంటల వ్యవధిలో ఎన్‌కౌంటర్

గ్రామాల్లో రైతుల సమస్యలను పరిష్కరించే ఉద్యోగులను కూడా తొలగించారు.  కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. ధరణిని బంగాళఖాతంలో కలిపేస్తుందని అప్పుడే చెప్పాం. రైతుల సమస్యలకు భూభారతి శాశ్వత పరిష్కారం చూపాలని కోరుకుంటున్నాం. రెవెన్యూ శాఖలో పనిచేసే వారిని దోషులుగా చూపే విధానానికి నేను వ్యతిరేకం. వాళ్లని మా ప్రభుత్వం పూర్తిగా నమ్ముతుంది. రైతుల హక్కులు కాపాడేందుకు అహర్నిశలు కృషి చేసిన రెవెన్యూ ఉద్యోగులు సైతం ఉన్నారు. ఎప్పుడూ కూడా ప్రభుత్వం, అధికారులు వేరు వేరు కాదు. రెవెన్యూ సిబ్బంది, ప్రభుత్వం కలిసి నడిస్తేనే విజయం ఉంటుంది. ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డ్‌ ఎలాగో ప్రతి భూమికి భూధార్‌ను తీసుకొస్తాం. ప్రతి భూమిపై కచ్చితమైన సరిహద్దులో రిజిస్ట్రేషన్ చెద్దామని ముఖ్యమంత్రి రేవంత్ అన్నారు. 

telugu-news | telangana 


 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు