పెద్దపల్లికి వరాల జల్లులు కురిపించిన సీఎం రేవంత్..

 పెద్దపల్లి జిల్లాకు సీఎం రేవంత్ వరాల జల్లులు కురిపించారు. జిల్లా పర్యటనలో భాగంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పెద్దపల్లి రూరల్ పోలీస్ స్టేషన్, మహిళా పోలీస్‌ స్టేషన్‌తో పాటు ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ను సైతం మంజూరు చేశారు.

New Update
CM REVANTH 4

 పెద్దపల్లి జిల్లాకు సీఎం రేవంత్ వరాల జల్లులు కురిపించారు. జిల్లా పర్యటనలో భాగంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పెద్దపల్లి రూరల్ పోలీస్ స్టేషన్, మహిళా పోలీస్‌ స్టేషన్‌తో పాటు ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ను సైతం మంజూరు చేశారు. అలాగే పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రిని 100 పడకలకు పెంచేందుకు పర్మిషన్ ఇచ్చారు. నాలుగు వరుసల బైపాస్ రోడ్డు, మంథనిలో 50 పడకల ప్రభుత్వ నిర్మాణానికి ఉత్తర్వులు జారీ చేశారు. గుంజపడుగులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పెద్దపల్లితో సహా మలుగు జిల్లాకు ఆర్టీసీ డిపోల ఏర్పాటుకు పర్మిషన్ ఇచ్చారు. 

అనంతరం యువవికాసం సభలో పాల్గొన్న సీఎం రేవంత్‌ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. '' మా ఉద్యోగాలు మాకు కావాలనే నినాదంతో తెలంగాణ ఉద్యమం పుట్టింది. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో ఏడాది క్రితం అధికారంలోకి వచ్చాం. తెలంగాణలో ఉద్యోగవకాశాలు, గిట్టుబాటు ధర వస్తుందని ఆశించారు. కానీ కేసీఆర్ పాలనలో రైతులకు గిట్టుబాటు ధర రాలేదు. రైతులు ఉరేసుకొని ఆత్మహత్యలు చేసుకున్నారు. ఉమ్మడి కరీంనగర్‌లో పదేళ్లపాటు ప్రాజెక్టులు పూర్తి చేయలేదు. 

Also read: రైల్వే టికెట్లపై రాయితీ.. అశ్వినీ వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు

ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కష్టపడుతోంది. కడుపుమంటతో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పదేళ్లు మోసం చేసినోళ్లే బజారుకు వచ్చి ఏం చేశారని అడుగుతున్నారు. శత్రువు ఏం చేస్తున్నారో చూస్తున్నాం. విష ప్రచారాన్ని తిప్పికొడతాం. బోనస్‌తో వరి రైతులు అత్యధికంగా లాభపడ్డారు. తక్కువ సమయంలో ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చి రికార్డు సృష్టించాం. ఏడాదిలోనే 55 వేల 143 ఉద్యోగాలు కల్పించి చరిత్ర సృష్టించాం. గుజరాత్‌లో ఏ ఏడాదైన 55 వేల ఉద్యోగాలు కల్పించారా ?. కిషన్ రెడ్డి, బండి సంజయ్ సమాధానం చెప్పాలి. గ్రూప్-4కు సెలెక్ట్ అయిన 8,084 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించాం.

Also Read: మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు కేసులో ట్విస్ట్.. హైకోర్టు కీలక ఆదేశం

ఏడాదిలోనే 25 వేల కోట్ల రుణమాఫీ చేసి చరిత్ర సృష్టించాం. నేను సవాలు చేస్తున్నా.. దేశంలో ఏ సీఎం అయినా రుణమాఫీ చేశారా ?. కాళేశ్వరం ఎక్కడుందో తెలియని పరిస్థితి వచ్చింది. కుక్క తోక తగిలి పందిరి కూలినట్లు కాళేశ్వరం పరిస్థితి ఉంది. వరి వేయండి బోనస్ ఇస్తామని మేము చెబుతున్నాం. కోటీ మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తాం. ఆడబిడ్డలు ఓటేస్తే మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. యూనివర్శిటీలను కేసీఆర్‌ నిర్వీర్యం చేశారు. సిబ్బంది లేక దివాళా తీస్తే మేమే నియామకాలు చేపట్టాం. ఇందిరా పార్క్‌లో ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. అదే పార్కుకు కేసీఆర్ తాళం వేసారు. ఇప్పుడు స్వేచ్ఛగా ఆందోళనలు, ధర్నాలు చేస్తున్నారంటే అదే ప్రజాపాలన. ఎవరు ధర్నా చేసినా గాంధీభవన్‌కు పిలిచి చర్చలు జరుపుతున్నాం.నాడు దొరల గడిగా ఉన్న ప్రగతిభవన్.. నేడు ప్రజాభవన్‌గా మారిందని'' సీఎం రేవంత్ అన్నారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు