Musi River: మూసీ నిర్వాసితులకు అండగా ఉండేందుకు రేవంత్ సర్కార్ సిద్దమైనట్లు తెలుస్తోంది. వారికి ఔటర్ రింగ్ రోడ్డు వెంట ఇంటి నిర్మాణం కోసం స్థలం ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. కాగా ఇప్పటికే మూసీ నిర్వాసితులకు రూ.25వేల ఆర్థిక సాయంతో పాటు డబుల్బెడ్రూం ఇండ్లు, ఉపాధి కోసం రూ.2 లక్షల లోన్లను ఇవ్వనున్నట్లు ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి రాజీనామా!
150 నుంచి 200 చదరపు గజాలు..
మూసీ బఫర్, ఎఫ్టీఎల్ లో ఇళ్లు నిర్మించుకున్న వారికి.. వాటిని ఖాళీ చేసే సమయంలో డబుల్ బెడ్రూం ఇళ్లతో పాటు స్థలాలు కూడా ఇవ్వాలనే యోచనలో సీఎం రేవంత్ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్కో కుటుంబానికి ఇంటి నిర్మాణం కోసం ఔటర్ రింగ్ రోడ్డు పక్కన 150 నుంచి 200 చదరపు గజాల స్థలం ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ నెల 26న జరగబోయే కేబినెట్ భేటీలో దీనిపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా ఇచ్చే స్థలం విలువ రూ.25 లక్షల నుంచి రూ. 30 లక్షల దాకా ఉంటుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఇందుకు అవసరం అయ్యే 700 ఎకరాలను ప్రభుత్వం కేటాయించనున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: తెలంగాణలో కాంగ్రెస్ నేత దారుణ హత్య!
రూ.1200 కోట్లు...
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ నది సుందరీకరణ కార్యక్రమంలో ఇల్లు కోల్పోతున్న నిర్వాసిత కుటుంబాలపై రేవంత్ సర్కార్ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటికే వారందరికీ 15 వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఒక్కో ఇంటి కోసం రూ.8లక్షల ఖర్చు అవుతుండగా.. మొత్తం రూ.1200 కోట్లను మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ నుంచి హౌసింగ్ డిపార్ట్‌మెంట్‌కు నగదు బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ మాజీ మంత్రి ఇంట్లో విషాదం!
కాగా మూసీ నది గర్భంలో నివాసం ఉంటున్న అనేక మంది ఇప్పటికే ప్రభుత్వం కేటాయించిన డబుల్ బెడ్రూం ఇళ్లలోకి వెళ్లారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో స్థలాలు కొని ఇళ్లు కట్టుకున్న వారు మాత్రం ససేమిరా అంటున్నారు. ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీ తమకు అవసరం లేదని తేల్చిచెబుతున్నారు. కోట్ల విలువైన తమ భవనాలను వదిలేసి డబుల్ బెడ్రూం ఇళ్లలోకి ఎలా వెళ్తామని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే అనేక మంది నిర్వాసితులు హైకోర్టును సైతం ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. వీరిని ఒప్పటించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇళ్ల స్థలాల కేటాయించాలని భావిస్తున్నట్లు సచివాలయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
ఇది కూడా చదవండి: వైసీపీ మాజీ ఎంపీ సత్యనారాయణకు బిగుస్తున్న ఈడీ ఉచ్చు