Chennamaneni Ramesh : చెన్నమనేని రమేష్కు మరో బిగ్ షాక్.. CID కేసు నమోదు!

మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు మరో బిగ్ షాక్ తగిలింది.  ఆయనపై తాజాగా సీఐడీ కేసు నమోదు చేసింది.  భారత పౌరసత్వం లేకున్నా తప్పుడు సర్టిఫికెట్లతో ఎన్నికల్లో పోటీ చేశారనే దానిపై ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

New Update
cid-case ramesh

cid-case ramesh

వేములవాడ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు మరో బిగ్ షాక్ తగిలింది.  ఆయనపై తాజాగా సీఐడీ కేసు నమోదు చేసింది.  భారత పౌరసత్వం లేకున్నా అక్రమంగా తప్పుడు సర్టిఫికెట్లతో ఎన్నికల్లో పోటీ చేశారనే దానిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ ఎఫ్ఐఆర్  నమోదు చేసింది. కేసు వివరాలు అందించడానికి బుధవారం తమ కార్యాలయానికి రావాలని ఆది శ్రీనివాస్‌ను పిలిచారు. 

 చెన్నమనేని రమేష్ రూ.25 లక్షలు అందజేత 

ప్రభుత్వం విప్ ఆది శ్రీనివాస్‌కు వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ రూ.25 లక్షలు అందజేశారు. ప్రస్తుత వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ చెన్నమనేని రమేష్‌పై 15ఏళ్ల న్యాయ పోరటంలో గెలిచిన విషయం తెలిసిందే. జర్మన్ పౌరసత్యం ఉన్న చెన్నమనేని రమేష్ అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారు. ఎమ్మెల్యేగా ఆయన ఎన్నిక చెల్లదని 2024 డిసెంబర్ 9న హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆది శ్రీనివాస్ చేన్నమనేని రమేష్ బాబు పౌరసత్వంపై గత దశాబ్ద కాలంగా చేస్తున్న న్యాయపోరాటంలో విజయం సాధించారు.

జర్మన్ పౌరసత్వంతో వేములవాడ ఎమ్మెల్యేగా

కోర్టు తీర్పులో భాగంగా 4 సార్లు ఎమ్మెల్యేగా కాకుండా ఆది శ్రీనివాస్ అవకాశాలకు గండి కొట్టిన చెన్నమనేని రమేష్ ఆది శ్రీనివాస్‌కు రూ.25 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. అంతేకాదు మరో రూ.5 లక్షలు లీగల్ సెల్‌కు ఇవ్వాలని హైకోర్టు చెప్పింది. సోమవారం చెన్నమనేని రమేష్ రూ.25 లక్షలు డీడీ రూపంలో న్యాయవాదుల ముందు చెల్లించారు. ఆది శ్రీనివాస్ వేసిన పిటిషన్‌పై ఐదేళ్ల పాటు విచారణ అనంతరం జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి తీర్పు వెలువరించారు.

Also read : ఫోన్ తీసుకుందని.. టీచర్‌ను చెప్పుతో కొట్టి, ల*జే అంటూ దాడిచేసిన విద్యార్థిని: (వీడియో)

Also Read: గూగుల్‌ లో వెతికి మరి చంపేసింది.. మాజీ డీజీపీ హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు!

Advertisment
తాజా కథనాలు