/rtv/media/media_files/2025/11/03/chevella-bus-accident-pic-fourteen-2025-11-03-11-50-56.png)
Chevella Road Accident
Chevella Accident update: రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు మృతి చెందారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించినట్లు వెల్లడించారు. క్షతగాత్రులకు రూ.2లక్షల చొప్పున పరిహారం అందిస్తున్నట్లు ప్రకటించారు.
చేవెళ్ల బస్సు ప్రమాదంపై దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా మృతుల కుటుంబాలకు ‘ప్రైమ్ మినిస్టర్ నేషనల్ రిలీఫ్ ఫండ్’ కింద ఒక్కొక్కరికి రూ. 2 లక్షలు పరిహారం ప్రకటించారు.ప్రమాదంలో గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ. 50,000 పరిహారం ప్రకటించారు. ఈ ప్రమాదంపై సమగ్ర విచారణకు ఆదేశించామని మంత్రి పొన్నం చెప్పారు. చేవెళ్లలోనే అన్ని మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాగా మీర్జాగూడ బస్సు ప్రమాదంలో ఇప్పటివరకు 19 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల్లో పది మంది మహిళలు, 8 మంది పురుషులు, ఒక చిన్నారి ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు మృతుల వివరాలను.. అధికారులు వివరించారు.
మృతులు వీరే...
దస్తగిరి బాబా, ( బస్సు డ్రైవర్ )
బచ్చన్ నాగమణి (55), భానూరు
ఏమావత్ తాలీబామ్, దన్నారమ్ తండా
తారిబాయ్ (45), దన్నారమ్ తండా
కల్పన (45), బోరబండ
మల్లగండ్ల హనుమంతు, దౌల్తాబాద్
ఏమావత్ తాలీబామ్, దన్నారమ్ తండా
గోగుల గుణమ్మ, బోరబండ
గుర్రాల అభిత (21), యాలాల్
తబస్సుమ్ జహాన్, తాండూరు
 షేక్ ఖలీద్ హుస్సేన్, తాండూరు
నాగమణి (55)- భానూరు
అభిత (21)- యాలాల్
గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు..
అబ్దుల్ రజాక్, హైదరాబాద్
వెంకటయ్య
బుచ్చిబాబు, దన్నారమ్ తండా
వెన్నెల
అశోక్
సుజాత
రవి
నందిని, తాండూరు
శ్రీను, తాండూరు
నందిని, తాండూరు
బస్వరాజ్, కోకట్(కర్ణాటక)
ప్రేరణ, వికారాబాద్
సాయి అక్రమ్, తాండూరు
అస్లామ్, తాండూరు
Also Read: Dadasaheb Phalke Awards 2025: ప్రభాస్ 'కల్కి' చిత్రానికి మరో అరుదైన గౌరవం! అవార్డుల ఫుల్ లిస్ట్ ఇదే
 Follow Us