/rtv/media/media_files/2025/11/01/dadasaheb-phalke-awards-2025-2025-11-01-19-39-56.jpg)
Dadasaheb Phalke Awards 2025
Dadasaheb Phalke Awards 2025: భారతీయ సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ‘దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్' 2025 వేడుక ముంబై వేదికగా అట్టహాసంగా జరిగింది. అక్టోబర్ 30న ముంబైలోని డోమ్, ఎస్.వి.పి. స్టేడియంలో జరిగిన ఈ వేడుకకు భారతీయ సినీ ప్రముఖులు, కళాకారులు, సినీ నిర్మాతలు సాంస్కృతిక ప్రముఖులు హాజరయ్యారు. సినీతారల ఆట పాటతో రెండు రోజుల పాటు అవార్డు వేడుక కనుల పండుగగా జరిగింది. సినిమా, టెలివిజన్ రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన సినిమాలు, నటీనటులకు ఈ అవార్డును అందజేస్తారు.
'కల్కి' కి అరుదైన గౌరవం
ఈ ఏడాది అవార్డు వేడుకలో ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. 'ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్' నిలిచి.. అవార్డును గెలుచుకుంది. అలాగే బాలీవుడ్ నుంచి ‘స్త్రీ 2’ చిత్రం బెస్ట్ మూవీగా నిలిచింది. ఉత్తమ నటుడిగా కార్తిక్ ఆర్యన్, ఉత్తమ నటిగా కృతి సనన్ అవార్డులు అందుకున్నారు. 2024 సంవత్సరానికి సంబంధించిన చిత్రాలు, వెబ్ సీరీస్ లకు గానూ ఈ పురస్కారాలు దక్కాయి.
Winners List
ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ : కల్కి 2898 AD
ఉత్తమ చిత్రం: స్త్రీ 2
ఉత్తమ నటుడు: కార్తిక్ ఆర్యన్ (చందు ఛాంపియన్
ఉత్తమ నటి: కృతి సనన్
ఉత్తమ దర్శకుడు: కబీర్ ఖాన్ (చందు ఛాంపియన్)
క్రిటిక్స్ బెస్ట్ ఫిల్మ్: లాపతా లేడీస్
క్రిటిక్స్ బెస్ట్ యాక్టర్ : విక్రాంత్ మాస్సే
బెస్ట్ వెబ్ సిరీస్: హీరామండి
బెస్ట్ యాక్టర్ (వెబ్ సిరీస్):జితేంద్ర కుమార్ (పంచాయత్)
బెస్ట్ యాక్ట్రెస్ (వెబ్ సిరీస్): హుమా ఖురేషి
Outstanding Contribution to the Film Industry Award: జీనత్ అమన్
Follow Us