TG: ఏకలవ్య పాఠశాలను సందర్శించిన బండి సంజయ్‌.. అధికారులపై సీరియస్‌

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని ఏకలవ్య మోడల్‌ స్కూల్‌ను కేంద్ర మంత్రి బండి సంజయ్‌ సందర్శించారు. విద్యార్థులు తాము తినే అన్నంలో రాళ్లు వస్తున్నాయని, టాయిలెట్ల లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. దీంతో మంత్రి అధికారులపై సీరియస్‌ అయ్యారు.

author-image
By B Aravind
New Update
Bandi Sanjay

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని ఏకలవ్య మోడల్‌ స్కూల్‌ను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ సందర్శించారు. అక్కడి విద్యార్థులతో మాట్లాడారు. అయితే విద్యార్థులు తాము తినే అన్నంలో రాళ్లు వస్తున్నాయని.. టాయిలెట్ల లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సమస్యలు వివరించారు. ఆ తర్వాత అధికారులు, ఉపాధ్యాయులతో మంత్రి సమావేశం నిర్వహించారు. విద్యార్థులు తినే అన్నంలో రాళ్లు వస్తున్నట్లు చెబుతున్నారని.. మన పిల్లలకు ఇలాంటి భోజనమే తినిపిస్తామా అంటూ అధికారులను ప్రశ్నించారు. టాయిలెట్లలో నీళ్లు రాకపోతే పట్టించుకోరా అంటూ మండిపడ్డారు. మొదటిసారి వచ్చాను కాబట్టి సున్నితంగా చెబుతున్నానని.. రెండోసారి వచ్చినప్పుడు ఇలా ఉండదని హెచ్చరించారు.

Also Read: ఆదిలాబాద్‌లో హోటళ్లపై పౌర సరఫరా అధికారుల తనిఖీలు

ఆ తర్వాత టాయిలెట్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన తర్వాత బండి సంజయ్‌ మాట్లాడారు. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు ప్రతి ఎంపీ కూడా తన పరిధిలో ఉన్న ఏకలవ్య పాఠశాలను సందర్శించి సమస్యలు తెలుసుకుంటున్నారని తెలిపారు. 2018-19లో దేశంలో ఉన్న 50 శాతం ఆదివాసీ గిరిజన ఎస్సీ, ఎస్టీ బ్లాకుల్లో ఏకలవ్య పాఠశాలలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయాలని నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఆ తర్వాత 2022లో 20 శాతం జనాభా ఉన్న బ్లాకుల్లో కూడా ఏకలవ్య పాఠశాలలు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. కేంద్రం దేశవ్యాప్తంగా 728 పాఠశాలలు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు 410 పాఠశాలల్లో విద్యాబోధన జరుగుతోందని.. 1.20 లక్షల మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారని తెలిపారు. 

భవణ నిర్మాణాలకు రూ.38 కోట్లు, నక్సల్‌ ప్రభావిత ప్రాంతాల్లో రూ.47 కోట్లు కోటాయిస్తున్నామన్నారు. ఇక తెలంగాణలో మొత్తం 23 ఏకలవ్య పాఠశాలలు ఉన్నాయని అందులో 8,300 మంది విద్యార్థులు చదువుకుంటున్నట్లు వివరించారు. ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చి.. వాళ్లలో ప్రతిభను వెలికి తీసి ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ప్రధాని మోదీ ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు