గ్రూప్-4 అభ్యర్థులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. ఈ నెల 14 నుంచి..

గ్రూప్-4 అభ్యర్థులకు తెలంగాణ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఈ నెల 14 నుంచి డిసెంబర్ ల9 వరకు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందిస్తామని ప్రకటించింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ రోజు వివరాలు వెల్లడించారు.  

New Update
TGPSC Group-4

గ్రూప్-4 అభ్యర్థులకు తెలంగాణ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఈ నెల 14 నుంచి డిసెంబర్ ల9 వరకు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందిస్తామని ప్రకటించింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ రోజు వివరాలు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఈనెల 14 నుంచి విజయోత్సవాలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఉత్సవాలపై ఈ రోజు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. ఉత్సవాల్లో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. ఈ ఉత్సవాల్లో గ్రూప్-4 ఉద్యోగాలకు ఎంపికైన వారిని నియామక పత్రాలు అందించనున్నట్లు తెలిపారు. 

ఏడాదిన్నరగా విడుదల కాని ఫలితాలు..

గ్రూప్-4 పరీక్ష నిర్వహించి ఏడాదిన్నర కావొస్తున్న ఫలితాలు విడుదల చేయకపోవడంపై అభ్యర్థులు చాలా రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా ఫలితాలు విడుదల చేసి నియామక ప్రక్రియ పూర్తి చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గత కేసీఆర్ సర్కార్ హయాంలో మొత్తం 8,180 గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. గతేడాది జూలైలో ఇందుకు సంబంధించిన పరీక్షను నిర్వహించారు. 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు