Asifabad Congress: కుమురంభీం జిల్లా కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. కులగణన అనే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే అభిప్రాయ సేకరణ కోసం బీసీ కమిషన్ నేతలు జిల్లాల పర్యటన చేపట్టారు. ఈ క్రమంలో ఈరోజు కుమురంభీం జిల్లాలో సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశంలోనే అంతర్గత కుమ్ములాట కాస్త బహిరంగం అయింది.
సమాచారం ఇవ్వలేదని....
ఈరోజు కుమురంభీం జిల్లా కేంద్రంలోని ఓ గార్డెన్‌లో కాంగ్రెస్ నాయకులు కులగణనపై చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేశారు. ఆయా విద్యార్థి, యువజన, వివిధ సంఘాల నేతలు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కాగా సమావేశం జరుగుతున్న సమయంలో అక్కడికి ఆసిఫాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి శ్యాంనాయక్ వర్గీయులు కొంత మంది వచ్చారు. ఈ సమావేశం గురించి తమ నాయకుడికి ఎందుకు సమాచారం ఇవ్వలేదంటూ డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్‌తో వాగ్వాదానికి దిగారు. ఆయనపై ఆగ్రహానికి లోనయ్యారు. ఇరు వర్గాల నడుమ మాటామాటా పెరగడంతో సమావేశం ఉద్రిక్తతగా మారింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో కొందరు కాంగ్రెస్ నాయకులకు గాయాలు అయ్యాయి.
ఇది కూడా చదవండి: అలిగిన టీడీపీ ఎంపీ.. మంత్రులు ఆపిన ఆగలేదు!
అరెస్ట్ చేయాలని డిమాండ్....
కాగా ఉద్రిక్త పరిస్థితుల నడుమ పోలీసులు శ్యాంనాయక్‌తో పాటు, ఆయన వర్గీయులను సమావేశం నుంచి బయటకు తీసుకెళ్లారు. ఈ చర్యకు నిరసనగా ఆయన వర్గీయులు గార్డెన్ ముందు నిరసనకు దిగారు. తమపై దాడి చేసిన నేతలను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఈ విషయంలో ఒకరికే మద్దతు తెలుపుతున్నారని.. కపక్షంగా విశ్వప్రసాద్‌కు మద్దతు తెలుపుతున్నారని నినాదాలు చేస్తూ బైఠాయించారు. కాగా వారి ఆందోళన ఉదృతం కావడంతో శ్యాంతోపాటు అందరినీ అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఇది కూడా చదవండి: జమ్మూ కశ్మీర్‌లో మరో పేలుడు.. 12 మందికి తీవ్ర గాయాలు
ఇది కూడా చదవండి: 'అమరన్' కు రికార్డ్ కలెక్షన్స్.. శివకార్తికేయన్ కెరీర్లోనే అరుదైన ఘనత..!