అలిగిన టీడీపీ ఎంపీ.. మంత్రులు ఆపిన ఆగలేదు!

AP: ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి అవమానం జరిగింది. నెల్లూరు రివ్యూ మీటింగ్‌లో మంత్రులకు స్వాగతం పలికి వేమిరెడ్డి పేరును ఆర్డీవో విస్మరించారు. దీంతో ఆయన సభ నుంచి వాకౌట్ చేశారు. మంత్రులు నారాయణ, రామనారాయణరెడ్డి ఆపినా ఆగలేదు.

New Update
Vemireddy Prabhakar Reddy

Vemireddy Prabhakar Reddy: నెల్లూరు MP వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అలిగారు. ఆయనకు ఘోర అవమానం జరిగింది. నెల్లూరులో రివ్యూ మీటింగ్‌ను వాకౌట్ చేశారు. నెల్లూరు జెడ్పీ ఆఫీసులో ప్రోటోకాల్ రగడ జరిగింది. నెల్లూరు రూరల్ ఆర్డీవో ప్రత్యూష ప్రోటోకాల్ పాటించలేదు. మంత్రులకు స్వాగతం పలికి వేమిరెడ్డి పేరును ఆర్డీవో విస్మరించారు. రివ్యూ మీటింగ్‌కు హోస్ట్‌గా ఆర్డీవో ప్రత్యూష వ్యవహరించారు.

స్టేజీ మీదనుంచి అలిగి వెళ్లిపోయారు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి. అధికారుల తప్పిదంతో మంత్రులు ఆనం, నారాయణ కంగుతిన్నారు. వేమిరెడ్డిని సముదాయించేందుకు ఏపీ మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, పొంగూరు నారాయణ  స్టేజీ దిగి వెళ్లారు. మంత్రుల విజ్ఞప్తిని వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్లిపోయారు.

Advertisment
తాజా కథనాలు