TET అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. రేపే ఫలితాలు!

AP: రేపు టెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. మంత్రి లోకేష్ టెట్ ఫలితాలను విడుదల చేయనున్నారు. అక్టోబరు 3 నుంచి 21 వరకు రోజుకు రెండు విడతలుగా టెట్‌ నిర్వహించగా.. 3,68,661 మంది పరీక్షలకు హాజరయ్యారు.

New Update
Tenth Results: నేడు పదవతరగతి స‌ప్లిమెంట‌రీ ఫ‌లితాలు!

TET Exam Results: ఏపీలో టెట్ ఫలితాలపై రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. టెట్ ఫలితాల విడుదల తేదీని ప్రకటించింది. రేపు ఐటీ శాఖ మంత్రి లోకేష్ టెట్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు తెలిపింది. కాగా వాస్తవానికి ఈ టెట్ ఫలితాలు నవంబర్ 2న విడుదల కావాల్సి ఉండగా.. తుది ‘కీ’ వెల్లడిలో ఆలస్యం జరగడం ఫలితాల విడుదల తేదీని వాయిదా వేశారు. 

ఇది కూడా చదవండి: అలిగిన టీడీపీ ఎంపీ.. మంత్రులు ఆపిన ఆగలేదు!

కాగా ఈ సోమవారం నాడు టెట్ ఫలితాలు వెలువడనున్నాయి. అయితే గత నెల అక్టోబర్ 3 నుంచి 21 వరకు రోజుకు రెండు విడతలుగా విద్యాశాఖ టెట్‌ నిర్వహించింది. ఈ పరీక్షకు 3,68,661 మంది హాజరయ్యారు. మొత్తం 4,27,300 మంది నిరుద్యోగులు ఈ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే దరఖాస్తు చేసుకున్న మొత్తంలో  86.28% మంది పరీక్ష రాసినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి: జమ్మూ కశ్మీర్‌లో మరో పేలుడు.. 12 మందికి తీవ్ర గాయాలు

6న మెగా డీఎస్సీ ప్రకటన!

ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలే లక్ష్యంగా పని చేస్తామని చెప్పిన కూటమి సర్కార్ ఈ దిశగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వ కొలువుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కొరకు మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఎన్నికల సమయంలో టీడీపీ.. తాము అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ ప్రకటిస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 

ఇది కూడా చదవండి: 'అమరన్' కు రికార్డ్ కలెక్షన్స్.. శివకార్తికేయన్ కెరీర్లోనే అరుదైన ఘనత..!  

ఇది కూడా చదవండి: 85 లక్షల వాట్సప్‌ అకౌంట్స్ బ్లాక్!

Advertisment
తాజా కథనాలు