BREAKING: కొట్టుకున్న కాంగ్రెస్ నేతలు!

TG: కుమురంభీం జిల్లాలో కాంగ్రెస్ నేతలు కొట్టుకున్నారు. కులగణన సమావేశానికి తమకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు అంటూ ASF కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి శ్యాంనాయక్‌ వర్గీయులు డీసీసీ చీఫ్ విశ్వప్రసాద్‌తో వాగ్వాదానికి దిగారు. మాటామాటా పెరిగి కొట్టుకునే దాక వచ్చింది.

New Update
CONGRESS FIGHT

Asifabad Congress: కుమురంభీం జిల్లా కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. కులగణన అనే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే అభిప్రాయ సేకరణ కోసం బీసీ కమిషన్ నేతలు జిల్లాల పర్యటన చేపట్టారు. ఈ క్రమంలో ఈరోజు కుమురంభీం జిల్లాలో సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశంలోనే అంతర్గత కుమ్ములాట కాస్త బహిరంగం అయింది.

ఇది కూడా చదవండి: TET అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. రేపే ఫలితాలు!

సమాచారం ఇవ్వలేదని....

ఈరోజు కుమురంభీం జిల్లా కేంద్రంలోని ఓ గార్డెన్‌లో కాంగ్రెస్‌ నాయకులు కులగణనపై చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేశారు. ఆయా విద్యార్థి, యువజన, వివిధ సంఘాల నేతలు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కాగా సమావేశం జరుగుతున్న సమయంలో అక్కడికి ఆసిఫాబాద్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి శ్యాంనాయక్‌ వర్గీయులు కొంత మంది వచ్చారు. ఈ సమావేశం గురించి తమ నాయకుడికి ఎందుకు సమాచారం ఇవ్వలేదంటూ డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్‌తో వాగ్వాదానికి దిగారు. ఆయనపై ఆగ్రహానికి లోనయ్యారు. ఇరు వర్గాల నడుమ మాటామాటా పెరగడంతో సమావేశం ఉద్రిక్తతగా మారింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో కొందరు కాంగ్రెస్ నాయకులకు గాయాలు అయ్యాయి.

ఇది కూడా చదవండి: అలిగిన టీడీపీ ఎంపీ.. మంత్రులు ఆపిన ఆగలేదు!

అరెస్ట్ చేయాలని డిమాండ్....

కాగా ఉద్రిక్త పరిస్థితుల నడుమ పోలీసులు శ్యాంనాయక్‌తో పాటు, ఆయన వర్గీయులను సమావేశం నుంచి బయటకు తీసుకెళ్లారు. ఈ చర్యకు నిరసనగా ఆయన వర్గీయులు గార్డెన్ ముందు నిరసనకు దిగారు. తమపై దాడి చేసిన నేతలను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఈ విషయంలో ఒకరికే మద్దతు తెలుపుతున్నారని.. కపక్షంగా విశ్వప్రసాద్‌కు మద్దతు తెలుపుతున్నారని నినాదాలు చేస్తూ బైఠాయించారు. కాగా వారి ఆందోళన ఉదృతం కావడంతో  శ్యాంతోపాటు అందరినీ అరెస్ట్‌ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 

ఇది కూడా చదవండి:  జమ్మూ కశ్మీర్‌లో మరో పేలుడు.. 12 మందికి తీవ్ర గాయాలు

ఇది కూడా చదవండి: 'అమరన్' కు రికార్డ్ కలెక్షన్స్.. శివకార్తికేయన్ కెరీర్లోనే అరుదైన ఘనత..!  

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు