Koushik Reddy: హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి మరో షాక్ తగిలింది. ఆయనపై మరో కేసు నమోదైంది. బంజారాహిల్స్ పోలీసులను బెదిరించారని ఆయనపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కేసు చేశారు. అరెస్టు కోసం వెళ్లినప్పుడు చనిపోతానని బెదిరించినట్లు FIRలో పేర్కొన్నారు. కాగా మరోసారి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేస్తారనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా జరుగుతోంది. అయితే రెండ్రోజుల క్రితం పాడి కౌశిక్ రెడ్డిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత బెయిల్ పై ఆయన విడుదల అయ్యారు. ఇది కూడా చదవండి: కేసీఆర్ కు ఆహ్వానం అందించిన మంత్రి పొన్నం..! ఫోన్ ట్యాప్ చేశారని... బుధవారం సాయంత్రం తన ఫోన్ ట్యాప్ చేశారని కౌశిక్ రెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట హల్ చల్ చేశారు. పోలీసులు ఫిర్యాదు ఇచ్చినా పట్టిచుకోవడం లేదని పోలీసు అధికారులతో దురుసుగా ప్రవర్తించాారు. పోలీస్ స్టేషన్ ముందు బీఆర్ఎస్ కార్యకర్తలతో ఆందోళనకు దిగారు. పోలీస్ స్టేషల్ లో విధులకు ఆటంకం కలిగించారని సీఐ రాఘవేంద్ర ఫిర్యాతో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆయన పై కేసు నమోదు చేశారు. పాడి కౌశిక్ రెడ్డితోపాటు ఆయన అనుచరులు 20 మంది మీద పోలీసులు పలు సెక్షన్లతో కేసు నమోదు చేశారు. ఇది కూడా చదవండి: ఇదెక్కడి వింతరా బాబు.. బంగారు నగలతో పిల్లికి శ్రీమంతం.. మామూలుగా లేదుగా! డిసెంబర్ 5న (గురువారం) ఉదయం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కొండాపూర్ లోని ఆయన నివాసంలో పోలీసులు అరెస్ట్ చేశారు. కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి పోలీసులు భారీగా ఆయన నివాసానికి వెళ్లారు. అదే సమయానికి మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, హరీశ్ రావులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలతో అక్కడికి చేరుకున్నారు. బలవంతంగా కౌశిక్ రెడ్డి ఇంట్లోకి వెళ్లాలని ప్రయత్నించిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. కాగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ తరువాత ఆయన బెయిల్ పై విడుదల అయ్యారు. ఇది కూడా చదవండి: BIG BREAKING: ఆ గ్రామాలకు జిల్లాలు మార్పు! ఇది కూడా చదవండి: రహాదారిపై కాంగ్రెస్ ఎంపీ అత్యుత్సాహం.. వాహనాలను ఆపి..!