TG Crime: ట్యాంక్‌బండ్‌పై కారు బీభత్సం.. డివైడర్ ఢీకొట్టి.. ఫుట్పాత్‌పైకి ఎక్కి.. చివరికి..!

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాటు మలుపు దగ్గర అతివేగంతో ఒక్కసారిగా కారు అదుపు తప్పింది. అనంతరం కారు డివైడర్ మీదకు దూసుకెళ్లి కరెంట్ పోల్‌ను ఢీకొట్టింది. దీంతో పోల్ రోడ్డుపై అడ్డంగా విరిగటంతోపాటు రెండు చెట్లు ధ్వంసమైయ్యాయి.

New Update
hyderadab crime

hyderadab crime

TG Crime: భాగ్యనగరంలో కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటన ట్యాంక్‌బండ్‌పై చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సోమవారం అర్ధరాత్రి సమయంలో ఖైరతాబాద్ జంక్షన్ నుంచి సెక్రటేరియట్ వైపు ఓ కారు  వెళ్తుంది. ఎన్టీఆర్ ఘాటు మలుపు దగ్గర అతివేగంతో ఒక్కసారిగా అదుపు తప్పింది. అనంతరం కారు డివైడర్ మీదకు దూసుకెళ్లి కరెంట్ పోల్‌ను ఢీకొట్టింది.  దీంతో పోల్ రోడ్డుపై అడ్డంగా విరిగటంతోపాటు రెండు చెట్లు ధ్వంసమైయ్యాయి.

మద్యం మత్తులో..

అయితే.. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడం పెద్ద ప్రమాదం తప్పింది. ఈ సమయంలో కారు నడిపిన వ్యక్తి ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డాడు.  ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. కారు నడిపిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నాడా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: విజయవాడలో విషాదం.. భర్త లేని టైంలో ఇంటికి వెళ్లి.. లవర్‌ను ఏం చేశాడంటే?

Advertisment
తాజా కథనాలు