AP Crime: విజయవాడలో విషాదం.. భర్త లేని టైంలో ఇంటికి వెళ్లి.. లవర్‌ను ఏం చేశాడంటే?

విజయవాడ నిడమనూరులోవివాహేతర సంబంధంతో కావ్య అనే మహిళను ప్రియుడు వాసు హత్య చేశాడు. తనతో ఫోన్ మాట్లాడకపోతే చంపేస్తానంటూ బెదిరించి ఇంటి వచ్చి చున్నీతో గొంతు బిగించి చంపిన్నాడు. కావ్య మర్డర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

New Update
vijayawada crime

vijayawada crime

AP Crime: వివాహేతర సంబంధం ఓ మహిళ హత్యకు దారి తీసిన ఘటన ఏపీలో కలకలం రేపింది. ఎన్టీఆర్‌ జిల్లా పటమట పోలీసుల తెలిపిన వివరాలప్రకారం.. విజయవాడ రూరల్‌ మండలం నిడమానూరుకు చెందిన కావ్య (23), ఆమె భర్త, ముగ్గురు ఆడ పిల్లలు కలిసి జీవిస్తున్నారు. కావ్వకు బాపట్ల జిల్లా రేపల్లెకు చెందిన ప్రకాష్‌రావుతో  9 సంవత్సరాల కిందట వివాహం జరిగింది.  వీరికి అక్షయ (5),  అక్షర (4), అమూల్య (2) అను ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు. భర్త వంట పనులు చేస్తుండగా.. ఆమె ఆస్పత్రిలో ఆయాగా ఉద్యోగం చేస్తుంది. 

చున్నీతో కావ్య మెడకు బిగించి హత్య:

ఈ సమయంలో నిడమానూరుకు చెందిన లాం వాసు అనే వ్యక్తతో పరిచయై అతనితోనే వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే ఈ విషయం ఆరు నెలల కిందట భర్తకు తెలిసి కావ్వను ఉద్యోగం మాన్పించారు. ఆమె అప్పటి నుంచి వాసుతో మాట్లాడడం మానేసింది. అప్పటి నుంచి వాసు కావ్యను బెదిరిస్తున్నాడు. అయితే.. శనివారం సాయంత్రం భర్త ప్రకాష్‌రావు బెంజ్‌సర్కిల్‌ ఓ హోటల్‌కు వంట పనికి వెళ్లాడు. కావ్య పిల్లలతోపాటు తాతతో కలిసి ఇంట్లో నిద్ర పోతున్నారు. 

ఇది కూడా చదవండి: నాలుకపై ఎరుపు, తెలుపు మచ్చలు క్యాన్సర్ సంకేతమా?

వాసు అర్ధరాత్రి 12 గంటల సమయంలో కావ్య ఇంటికి వచ్చి ఆమెతో గొడవ పడి.. చున్నీతో కావ్య మెడకు బిగించి హత్య చేశాడు. పక్క గదిలో ఉన్న ఆమె తాతయ్య చూసి కేకలు వేయగా అక్కడ నుంచి వాసు పరారయ్యాడు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. భర్త ప్రకాష్‌రావు ఫిర్యాదు మేరకు  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పటమట సీఐ వి.పవన్‌ కిషోర్‌ తెలిపారు.

 



ఇది కూడా చదవండి: తెలంగాణలో బర్డ్ ఫ్లూ కల్లోలం.. ఒకే రోజు ఎన్ని వేల కోళ్లు చనిపోయాయంటే?

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు