KTR: కేటీఆర్ అరెస్ట్ కు రంగం సిద్ధం.. ఎమ్మెల్యే పదవి కూడా పోతుందా?

ఫార్ములా-ఈ రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్ అరెస్ట్ అవుతారన్న ప్రచారం తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది. కేటీఆర్ పై పీసీ యాక్ట్ 17ఏ కింద కేసు నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది. తప్పు చేసినట్లు తేలితే ఆయన ఎమ్మెల్యే పదవిని కూడా కోల్పోయే ప్రమాదం ఉంది.

New Update

కేటీఆర్‌ అరెస్టుకు రేవంత్ సర్కార్ రంగం సిద్ధం చేస్తోందన్న ప్రచారం పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది. అవినీతి నిరోధక చట్టం 17A కింద కేటీఆర్ అరెస్టు ఉంటుందన్న చర్చ వినిపిస్తోంది. కేటీఆర్ పురపాలక మంత్రిగా ఉన్న సమయంలో నిధుల దుర్వినియోగం కింద ఏసీబీ చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ రేసుకు సంబంధించి కేబినెట్ అప్రూవల్ లేకుండా రూ.55 కోట్ల నిధులు కేటీఆర్ చెబితేనే విడుదల చేశామని IAS అధికారి అరవింద్ కుమార్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. గతంలో ఏపీ సీఎం చంద్రబాబు సైతం ఇదే PC 17A యాక్టు కింద అరెస్టు అయ్యారు. ఈ కేసులో నిధుల దుర్వినియోగం జరిగిందని తేలితే KTR MLA పదవిని సైతం కోల్పోయే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. ఈ చట్టం ప్రకారం.. 7 సంవత్సరాలు పోటీకి దూరంగా ఉండాల్సి ఉంటుంది. అయితే.. కేటీఆర్ అరెస్టకు సంబంధించి బంతి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కోర్టులో ఉందన్న చర్చ సాగుతోంది.

Also Read :  ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 మెయిన్స్‌ పరీక్ష వాయిదా

ప్రివెన్షన్ ఆఫ్‌ కరప్షన్ యాక్ట్ సెక్షన్ 17ఏ ప్రకారం మంత్రిగా పని చేసిన కేటీఆర్ ను విచారించాలంటే గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి గవర్నర్ కు ప్రభుత్వం నుంచి లేఖ రాసింది. అయితే.. గవర్నర్ ఇందుకు సంబంధించి అటార్నీ జనరల్ కు లేఖ రాశారు. అటార్నీ జనరల్ సూచన ప్రకారం గవర్నర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే.. కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లుగానే అటార్నీ జనరల్, గవర్నర్ నడుచుకుంటారన్న ప్రచారం సాగుతోంది. అటార్నీ జనరల్ గవర్నర్ కు ఈ కింది మూడు సూచనల్లో ఏదో ఒకటి ఇచ్చే అవకాశం ఉంది.. 1. విచారణలో అప్పటి మంత్రులను పక్కన పెట్టాలని.. 2. నిధుల మళ్లింపులో బిజినెస్ రూల్స్ ను బ్రేక్ చేయలేదని.. 3. కేటీఆర్ పై విచారణ జరపొచ్చు.. 

Also Read :  అరెస్టులు ఖండిస్తున్న వారిపై చర్యలు తీసుకోండి..డీజీపీకి జేఏసీ ఫిర్యాదు

అలా చేస్తే కేటీఆర్ కు బిగ్ రిలీఫ్..

మొదటి రెండు సూచనల్లో ఏదో ఒకటి ఇచ్చినా.. కేటీఆర్ కు బిగ్ రిలీఫ్ దొరుకుతుంది. ఆయనపై విచారణ ఇక ఉండదు. దీంతో కేటీఆర్ ఈ కేసు నుంచి దాదాపు బయటపడినట్లే అవుతుంది. బీఆర్ఎస్ నేతలు ఆరోపించినట్లు బీజేపీ పెద్దలను నిజంగానే రంగంలోకి దిగి అటార్నీ జనరల్, గవర్నర్ నిర్ణయాన్ని ప్రభావితం చేస్తే ఇది సాధ్యం అవుతుందన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందటూ గతంలో జరిగిన చర్చను ఇప్పుడు గుర్తుకు చేసుకుంటున్నారు. కవిత జైలులో ఉన్న సమయంలో వచ్చిన మీడియా కథనాలను ప్రస్తావిస్తున్నారు. ఆ మీడియా కథనాల్లో పేర్కొన్నట్లుగానే కవితకు బెయిల్ వచ్చిందని.. ఇప్పుడు కేటీఆర్ కు కూడా బీజేపీ హెల్ప్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇదే జరిగితే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం లేదా పొత్తు అంశం మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది.

Also Read : పోలీసులే కారణం.. లగచర్ల ఘటనపై మంత్రి శ్రీధర్ బాబు సంచలనం!

#brs #ktr-arrest #Formula E Race Scam
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe