KCR: ఆ అంశాలపై పోరాడుదాం.. ప్రభుత్వం మెడలు వంచుదాం.. ఎమ్మెల్యేలకు కేసీఆర్ కీలక సూచనలు!

బీసీ, ఎస్సీ రిజర్వేషన్లు, రైతుల సమస్యలు, గురుకులాల్లో దారుణాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని BRS ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. రేపు తాను అసెంబ్లీకి వస్తున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఈ రోజు కేసీఆర్ తెలంగాణ భవన్ లో సమావేశమయ్యారు.

New Update

రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యలు, ఎండిన పంటలు, అందని కరెంటు, సాగునీరు, కాలిపోతున్న మోటర్లు తదితర రైతాంగ సమస్యలు, మంచినీటి కొరత పై అసెంబ్లీ, మండలిలో పోరాడాలని బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశా నిర్దేశం చేశారు. మంగళవారం తెలంగాణ భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ.. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అరగంట ముందే సమావేశాలకు హాజరు కావాలని సూచించారు. తెలంగాణ ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలన్నారు. అవినీతి, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై ప్రభుత్వాన్ని చీల్చి చెండాడాలన్నారు. బీఆర్ఎస్ మీద ప్రభుత్వం చేస్తున్న తప్పుడు నిందలను తిప్పి కొట్టాలన్నారు.  
ఇది కూడా చదవండి: Manchu Mohan Babu : సౌందర్యది హత్యే! చంపింది మోహన్ బాబే.. మంచు మోహన్‌ బాబుపై సంచలన ఫిర్యాదు

రిజర్వేషన్ల బిల్లులకు మద్దతుగా గొంతు వినిపిద్దాం..

బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ రిజర్వేషన్ల బిల్లుకు మద్దతుగా గొంతు వినిపించాలన్నారు. రాష్ట్రంలో గురుకులాలు నిర్వీర్యం అవుతున్న తీరుపై మాట్లాడాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్, డీఏల పెండింగ్, పీఆర్సీ అమలుపై అసెంబ్లీ, మండలి వేదికగా ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. మహిళలకు ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చాలని కొట్లాడాలన్నారు. 6 గ్యారంటీల అమలులో ప్రభుత్వం అనుసరిస్తున్న మోసపూరిత వైఖరిని నిలదీయాలన్నారు. 
ఇది కూడా చదవండి: Rajeev Yuva Vikas : నిరుద్యోగులకు గుడ్ న్యూస్...రూ. 6 వేల కోట్లతో...

విద్యార్థుల ఓవర్సీస్ స్కాలర్షిప్ లు విడుదల చేయక పోవడంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ సూచించారు. వైద్య రంగంలో దిగజారుతున్న ప్రమాణాలపై నిలదీయాలన్నారు. గొర్రెల పెంపకం.. చేపల పంపిణీ సమగ్ర అమలు కోసం అసెంబ్లీ, మండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాలను, వారి ఆకాంక్షలను అర్థం చేసుకొని వారి గొంతుకగా బీఆర్ఎస్ సభ్యులు ఉభయ సభల్లో ప్రభుత్వాన్ని పశ్నించాలని దిశా నిర్దేశం చేశారు కేసీఆర్.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు