/rtv/media/media_files/2025/01/31/wu9vvXj0fmoRZantIXX5.jpg)
బీఆర్ఎస్ కార్యకర్తలతో మాట్లాడుతున్న కేసీఆర్
ఫిబ్రవరిలో భారీ బహిరంగ సభ పెట్టి.. కాంగ్రెస్ పార్టీ కథ చూస్తామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. ఈ రోజు జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ ముఖ్య నేతలతో జరిగిన సమావేశంలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ మీటింగ్ అన్ని ప్రాంతాల వారికి దగ్గరలో ఉండేలా ప్లాన్ చేస్తామన్నారు. నాలుగు రోజులు ఆగాలని తాను ఇన్ని రోజులు చూశానన్నారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన కారణంగా భారీ బహిరంగ సభ పెట్టాలని పార్టీ నేతల నుంచి ప్రతిపాదనలు వచ్చాయన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఫిబ్రవరి నెలాఖరులో భారీ సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. దీంతో కేసీఆర్ రీ ఎంట్రీ ఆ సభ నుంచే ఉండనున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: MLC Kavitha : కేరళ లిక్కర్ స్కామ్ .. ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్
భారీ ఎత్తున ప్రజల్లోకి వచ్చేందుకు ప్లాన్..
తాను కొడితే.. ఒట్టిగ కొట్టుడు అలవాటు లేదన్నారు. తెలంగాణ బాగు కోసం మళ్లీ మనమే కొట్లాడుదామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రాణం పోయినా సరే తెలంగాణ కోసం కొట్లాడుదామన్నారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి తర్వాత భారీ ఎత్తున కేసీఆర్ ప్రజల్లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మార్చిలో నిర్వహించే బడ్జెట్ సమావేశాలకు సైతం కేసీఆర్ హాజరుకానున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. స్థానిక ఎన్నికల్లోనూ కేసీఆర్ ప్రచారం చేసే ఛాన్స్ ఉంది.
ఇది కూడా చదవండి: Telangana Assembly: ఫిబ్రవరి 7న అసెంబ్లీ స్పెషల్ సమావేశాలు.. కులగణనపై కీలక ఘట్టం
నేను కొడితే మామూలుగా ఉండదు
— RTV (@RTVnewsnetwork) January 31, 2025
తన వ్యవసాయ క్షేత్రంలో జహీరాబాద్ బీఆర్ఎస్ కార్యకర్తలతో భేటీ అయిన మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు@KCRBRSPresident #Telangana #kcr #warning #RevanthReddy #RTV pic.twitter.com/mWfTinf0fX
తెలంగాణలో ఏ ఒక్క పథకం కూడా సరిగ్గా అమలు కావడం లేదన్నారు. అన్ని పథకాలు గంగలో కలిశాయన్నారు. కరోనా వచ్చిన కూడా తాను రైతు బంధు ఆపలేదన్నారు. రైతు బీమా వల్ల ఎంతోమంది రైతులకు సహాయం జరిగిందని గుర్తు చేశారు. కైలాసం ఆడంగా పెద్ద పాము మింగినట్లు అయ్యింది తెలంగాణ ప్రజల పరిస్థితి అన్నారు.