Padi Koushik Reddy : బీఆర్ఎస్ నేతలందరూ డ్రగ్స్ టెస్ట్ చేసుకోవాలని రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ వేసిన సవాల్ ను తాము స్వీకరిస్తున్నామని అన్నారు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారని తాను చెప్పినట్లు చెప్పారు. కానీ.. అనిల్ కుమార్ యాదవ్ ఎవరికి చెప్పకుండా హాస్పిటల్ కు వెళ్లారని అన్నారు. నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు టెస్ట్ కు రావాలని చెప్పినట్లు గుర్తు చేశారు.
Also Read : 'కంగువా' మూవీ టీమ్ కు బిగ్ షాక్.. అతని ఆకస్మిక మరణంతో?
డ్రగ్స్ కేసులో నన్ను...
తమకు చెప్పకుండా వెళ్లి రమ్మంటే ఎట్లా? అని ప్రశ్నించారు. అనిల్ కుమార్ యాదవ్ తనకు మంచి మిత్రుడని అన్నారు. తాను అనిల్ కుమార్ యాదవ్ ను తిట్టవచ్చు వార్డు మెంబర్ గా గెలవడని.. కానీ, నా పంచాయితీ అనిల్ కుమార్ యాదవ్ తో కాదు.. రేవంత్ రెడ్డితో తనకు పంచాయితీ అని అన్నారు. డ్రగ్స్ కేసులో నన్ను ఇరికించాలని రేవంత్ రెడ్డి ప్రయత్నం చేశారని సంచలన ఆరోపణలు చేశారు. మేము కౌశిక్ రెడ్డిని ట్రాప్ చేయలేదని ఇంటిలిజెన్స్ చీఫ్ ను ప్రెస్ మీట్ పెట్టి చెప్పామను అని నిలదీశారు.
Also Read : యష్మి చేసిన పనికి వెక్కి వెక్కి ఏడ్చిన నిఖిల్.. బతిమాలినా వద్దంటూ
రేవంత్ కు నా సవాల్..
రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతున్నా అని అన్నారు. రేవంత్ రెడ్డి తన ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు, ఎంపీలతో డ్రగ్స్ టెస్ట్ కు రావాలని అన్నారు. మేము డబ్బా పట్టుకుని రెడీగా ఉన్నామన్నారు. తమ ఎమ్మెల్యేలు అందరు వెయిట్ చేస్తున్నారు ఇప్పటి వరకు మమ్మల్ని పిలవలేదని చెప్పారు. ఆరు గ్యారెంటీలను అమలు చేయలేక డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి డ్రగ్స్ గురించి మాట్లాడితే చిత్తశుద్ధితో మాట్లాడాలని అన్నారు. నన్ను ట్రాప్ చేసినట్లు.. రాజ్ పాకాల కుటుంబాన్ని ఇరికించాలని చూశారని ఆరోపించారు.
Also Read : రేవంత్‌కు బిగ్ షాక్..కేసీఆర్‌కు టచ్‌లోకి ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు?
Also Read : మెగాస్టార్ మూవీలో మీనాక్షి చౌదరి.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్