BREAKING: వారికి నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి AP: చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వేద విద్యను అభ్యసించి, ఎటువంటి ఉపాధి లేకుండా ఉన్న వేద పండితులకు నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి చెల్లించేందుకు సిద్ధమైంది. మొత్తం 600 మందికి ఈ భృతి అందనుంది. By V.J Reddy 31 Oct 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి CM Chandrababu: ఏపీలో చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన మరో హామీని అమలు చేసేందుకు సిద్ధమైంది. వేద విద్యను అభ్యసించి, ఎటువంటి ఉపాధి లేకుండా ఉన్న వేద పండితులకు నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి చెల్లించాలని నిర్ణయించింది. కాగా రాష్ట్రంలో మొత్తం ఇప్పటి వరకు 600 మంది ఉన్నట్ల్లు దేవాదాయశాఖ అధికారులు తెలిపారు. వీరందరికీ నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇచ్చేలా దేవాదాయశాఖ కార్యదర్శి ఎస్.సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. ఇది కూడా చదవండి: రెండు రోజుల ముచ్చటే..మళ్ళీ నష్టాల్లోకి మార్కెట్ వైట్ రేషన్ కార్డు ఉన్నవారు మాత్రమే.. ఇది కూడా చదవండి: కొండగట్టులో అఘోరీ.. రేపే ఆత్మార్పణ ! కాగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ఏపీలో ఎన్డీయే కూటమి కార్యాచరణ చేపట్టింది. ఈ క్రమంలో ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో మరో పథకానికి శ్రీకారం చుట్టింది. ఏడాది మూడు సిలిండర్ల పథకానికి పచ్చ జెండా ఊపింది. ఇదిలా ఉంటే ఇప్పటికే సిలిండర్ బుక్ చేసుకున్న వారికి దీపావళి రోజున డెలివరీ చేస్తారు. అయితే సిలిండర్ కోసం గ్యాస్ ఏజెన్సీకి రూ.811 కట్టాలి. మళ్లీ ఈ మొత్తం రెండు రోజుల్లో మీ అకౌంట్లలోకి జమ అవుతుంది. వైట్ రేషన్ కార్డు ఉన్నవారంతా ఈ ఉచిత సిలిండర్‌కు అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా చదవండి: రేవంత్ సర్కార్‌కు బిగ్ షాక్.. కులగణనకు బ్రేక్ ఇదిలా ఉండగా.. ఈ మూడు సిలిండర్లు ఏడాదిలో మూడు విడతలుగా ఇవ్వనున్నారు. అక్టోబర్ 31 నుంచి మార్చి నెలాఖరులోగా ఒకటి. ఏప్రిల్ 1, 2025 నుంచి జులై వరకు మరొకటి. జులై నుంచి నవంబర్ వరకు మూడో సిలిండర్ ఉచితంగా ఇవ్వనున్నారు. అయితే ఈ పథకం అమల్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా.. 1967 ట్రోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేయాలని ప్రభుత్వం సూచించింది. ఇక ఉచిత గ్యాస్ బుకింగ్‌కు తప్పకుండా తెల్ల రేషన్‌కార్డు, ఆధార్ కార్డుదారులు ఉండాలి. ఇది కూడా చదవండి: రేవంత్ కుట్రలకు భయపడేది లేదు: KTR మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి