యూజ్ లెస్ ఫెలో.. నిండు సభలో హరీశ్ రావు షాకింగ్ కామెంట్స్!

బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలు మరోసారి శాసనసభలో వివాదాస్పదమయ్యాయి. ఆయన మాట్లాడుతుండగా కాంగ్రెస్ సభ్యులు దొంగ అంటూ కామెంట్ చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన హరీశ్.. నన్ను దొంగ అన్న యూజ్ లెస్ ఫెలో ఎవరు అంటూ ఫైర్ అయ్యారు.

New Update
Harish Rao Vs Komatireddy

నన్ను దొంగ అన్న యూజ్ లెస్ ఫెలో ఎవరు అంటూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు శాసనసభలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఉద్ధేశించే ఆయన ఆ మాట అన్నట్లు తెలుస్తోంది. హరీశ్ రావు మాట్లాడుతుండగా దొంగా అనడంతో ఆగ్రహంతో ఈ కామెంట్స్ చేసినట్లు సమాచారం. హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలతో అసెంబ్లీలో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. అధికార పక్ష సభ్యుల ఆందోళనతో హరీశ్ రావు కామెంట్స్ ను స్పీకర్ రికార్డుల నుంచి తొలగించారు.
ఇది కూడా చదవండి: అసెంబ్లీలో పేపర్లు విసిరికొట్టి వెళ్లిపోయిన అక్బరుద్దీన్.. వీడియో వైరల్!

హరీశ్ రావు క్షమాపణ చెప్పాలని డిమాండ్..

హరీశ్ రావు క్షమాపణ చెప్పాలని రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. హరీశ్ లాంటి సీనియర్ సభ్యులు మాట్లాడాల్సిన వ్యాఖ్యలు ఇవి కాదన్నారు. మంత్రి శ్రీధర్ బాబు దొంగ దొంగ అని ఐదు సార్లు అన్నారని హరీశ్ రావు అన్నారు. మరి ఆయన కూడా క్షమాపణ చెబుతారా? అని ప్రశ్నించారు. నన్న దొంగ అన్న వారిని యూజ్ లెస్ ఫెలో అనడం తప్పా? అని ప్రశ్నించారు. ఎవ్వరు అలా అన్నా క్షమాపణ చెప్పాల్సిందే అని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: రేవంత్‌కు రోజూ పత్తాలు ఆడే అలవాటు.. కేటీఆర్ షాకింగ్ ఆరోపణలు!

ఇదిలా ఉంటే.. నిన్న కూడా హరీశ్ రావు శాసనసభలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. బయట రోడ్ల మీద చేసినట్లుగానే అసెంబ్లీలో సైతం డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేయాలని హరీశ్ రావు స్పీకర్ ను కోరారు. దీనికి కాంగ్రెస్ సభ్యులు తీవ్రంగా స్పందించారు. హరీశ్ రావుకు మామ కేసీఆర్ గుర్తుకు వచ్చి ఇలా మాట్లాడి ఉంటారని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కౌంటర్ ఇచ్చారు. దీంతో స్పకర్ ఈ ఇద్దరు సభ్యుల వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు. 

ఇది కూడా చదవండి:కేటీఆర్ పై ఏసీబీ కేసు.. ఏ క్షణమైనా అరెస్ట్?

Advertisment
Advertisment
తాజా కథనాలు