రేవంత్‌కు బీఆర్‌ఎస్ బిగ్ షాక్.. అల్లుడిపై ఈడీకి ఫిర్యాదు సీఎం రేవంత్ అల్లుడి కంపెనీ మ్యాక్స్‌బిన్ ఫార్మా కంపెనీపై బీఆర్‌ఎస్ ఈడీకి ఫిర్యాదు చేసింది. ఈ కంపెనీకి సంబంధించి కోట్ల రూపాయల బ్యాంక్ కుంభకోణం, నిధుల మళ్లింపు ఆరోపణలపై విచారణ చేపట్టాలని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఈ ఫిర్యాదు చేశారు. By B Aravind 19 Nov 2024 in తెలంగాణ Latest News In Telugu New Update షేర్ చేయండి సీఎం రేవంత్‌కు బీఆర్‌ఎస్ పార్టీ షాకిచ్చింది. కొడంగల్ ఫార్మాలో ఆయన అల్లుడు గొలుగూరి సత్యనారాయణ రెడ్డిని మరో చిక్కులో పడేసింది. రేవంత్ అల్లుడి కంపెనీ మ్యాక్స్‌బిన్ ఫార్మా కంపెనీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED)కి ఫిర్యాదు చేసింది. కోట్ల రూపాయల బ్యాంక్ కుంభకోణం, నిధుల మళ్లింపు ఆరోపణలపై విచారణ చేపట్టాలని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఈ ఫిర్యాదు చేశారు. గొలుగూరి సత్యనారాయణకు మ్యాక్స్‌బిన్ కంపెనీలో 16 లక్షల షేర్లు ఉన్నాయి. ప్రస్తుతం ఈ కంపెనీకి ఆయన డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ సంస్థకు మరో డైరక్టర్‌గా అన్నం శరత్ కూడా ఉన్నారు. Also Read: ఎట్టకేలకు చిక్కిన సురేష్.. లగచర్ల ఘటనలో కీలక నిందితుడి అరెస్ట్! అయితే సత్యనారాయణకు మరో కంపెనీలో కూడా డైరక్టర్‌గా 21 లక్షల షేర్లు ఉన్నాయి. రేవంత్ అల్లుడి కుటుంబంపై ఈ ఏడాది జులైలో ఈడీ కేసులు నమోదయ్యాయి. దీంతో గొలుగూరి రామకృష్ణను ఈడీ ముద్దాయిగా చేర్చింది. కొట్లాది రూపాయల బ్యాంక్ కుంభకోణ, నిధులు మళ్లింపు ఆరోపణలు ఉన్నాయి. గొలుగూరి కుటుంబ సభ్యులపై ఎన్నో బ్యాంక్ ఎగవేత కేసులు ఉన్నాయని క్రిశాంక్ ఆరోపించారు. మ్యాక్స్‌బిన్ ఫార్మా ఆర్థిక లావాదేవీలపై విచారణ చేపట్టాలని ఈడీని కోరారు. క్రిశాంక్ ఇచ్చిన ఫిర్యాదును కేంద్ర దర్యాప్తు సంస్థ స్వీకరించింది. Also Read: వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు ఔట్.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు! ఈ సందర్భంగా మన్నె క్రిశాంక్ మాట్లాడారు. ''కొడంగల్ నియోజకవర్గంలో రైతుల భూములను తీసుకొని మ్యాక్స్‌బిన్ ఫార్మా కంపెనీకి అప్పగించాలని సీఎం రేవంత్ నిర్ణయించారు. రేవంత్ అల్లుడి కుటుంబంపై ఇప్పటికే ఈడీ విచారణలు కొనసాగుతున్నాయి. వాళ్లు ఎన్నో మోసాలకు పాల్పడి రుణాలను దారి మళ్లించారు. ఈ నిధులను ఇతర కుటుంబ సభ్యులకు, ఇతర వ్యాపారులకు తరలించారు. ఈరోజు కొండంగల్‌లో మ్యాక్స్‌బిన్ ఫార్మా చుట్టూ ఏదైతే చర్చ నడుస్తోందో.. ఇందులో కూడా నిధులు దారి మళ్లించినట్లు అనుమానం ఉంది. ఈ నేపథ్యంలోనే రేవంత్ అల్లుడు మాక్స్‌బియాన్ ఆర్థిక లావాదేవీలపై విచారణ చేపట్టాలని ఈడీకి ఫిర్యాదు చేశానని'' క్రిశాంత్ వెల్లడించారు. Also Read: రేవంత్ నీ బతుకెంతా.. ఈటల సంచలన వ్యాఖ్యలు #CM Revanth #telugu-news #telangana-news #brs మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి